వేచివుంటా నీకోసం .....
వేచివుంటా నీకోసం .....
బతుకుదెరువు పోరాటంలో
బడలికలేని పయనం కోసం
పొగబండికై కాపు కాసే కూలిలా !
వేచిచూస్తా నీకోసం ....
నింగి తొంగిచూసి మలయ మారుతాలను
ముత్యాలుగా రాల్చేదాకా
నమ్మకం కోల్పోని రైతులా !!
వెంటపడుతున్నా ఒడి చేరవా?
వేడుకుంటున్నా కనికరింపవా?
నా కన్నీటితో నీకు జలకాలాటలేలా?
నా ఊహలతో నీకు సయ్యాటలేలా?
భగవంతుడా!
నీవైనా కరిగింపవా ఆ కరగని మనసును,
ఇప్పించవా చోటు ఆ సిలాంతరాలాల్లో,
నా హృదయ మంటలు ఆరని చితి మంటలై
నను నిలువెల్లా కాల్చకముందే !
నా ఊహలన్నీ ఓ ఉప్పెనై
నా మస్తిస్కాన్ని మట్టుబెట్టకముందే :(