నీ సాంత్వన కోసం రేయిపగలు ఎదురుచూస్తున్నాను ....
హృదయాన ఉదయించే తొలి ఆశ వోలె
సంద్రంలో విహరించెడి అల్లల ప్రవాహం వోలె
నువ్వు నడిచే దారిలో మట్టిగా ఉన్న నేను
నీ పాదాల స్పర్శతో
రేయంతా వికసించే వెన్నెల గొడుగులా మారాను ....
మది వీడని తొలి అశపు కలగా
తడి ఆరని ఇసుక రేణువులా
గమ్యం తెలియని ఈ ప్రేమ ఎడారిలో
ఒంటెగా విహరిస్తున్నాను ....
ఊహల కొలనులో విహరించే ఓ పద్మమా
నీ సుగంద పరిమళాల కోసం వేచె ఎన్నో తుమ్మెదలు
నీ మది బాషని మురిపించే తుమ్మెదనై
నీ మేనిసిగ్గు తొలకరిలో పలికే అధరాల పూలరేకునవుతాను
ఆశే శ్వాసగా వీచే పరిమళ వజ్ర పరాగంలా దాగ్గున్నా
నీ సాంత్వన కోసం రేయిపగలు ఎదురుచూస్తున్నాను ....