తలపు, కడలిలో దారిచూపిన ధ్రువకిరణం,
నీ స్నేహం, ఏడారిలో పూసిన నవవసంతం,
నీ సహచర్యం, నిశీధిలో తాకిన శశికిరణం,
నీ వలపు, నా జీవిత మధురకావ్యం.
నీ మౌనం, నా పాలిట మరణమృదంగం.
నా కలలకు రూపం నీవే
నా కవితకు భావం నీవే
నా గాత్రానికి గానం నీవే
నా కలానికి కదలిక నీవే
నా బొమ్మకు జీవం నీవే
నా ప్రాయం, ప్రాణం, నా సర్వస్వం... నీకే అర్పితం!
నీ మౌనం ఛేదించి, నను చేర రావా ప్రియా.ప్లీజ్