చిరుగాలి స్పర్శే లేక ....
చివురాకు కమిలిపోయే .......
చందనాల పరిమళాలు మోసుకోస్తావో లేదో
మనసైన గీతం వినక ......
మాపటికి వెలుగే రాదే ........
జాబిలింక చిచ్చుబుడ్డై నవ్వుతుందో లేదో
కలలన్ని నిజమవ్వక .......
కునుకన్నది రానే రాదే.........
నీ కళ్ళ వాకిళ్ళు తెరిచేది ఎన్నడో
తలనిమిరే తపనే తీరక
కురులన్ని చెదిరిపోయే ......
నీ ముని వెళ్ళు నాట్యాలు నేర్చాయో లేదోతడి తీరని ఆశలన్ని ......
తుడిచేసి పోవటానికి .......
తువ్వాలై నీ తోడు దొరికేది ఎప్పుడో ....
నడకలనే మరిచిన గుండె
గంతులనే నేర్చిందని
చెపితే నువ్వు నమ్ముతావో నవ్వేసి పోతావో ..
అందర్నీ నమ్మడం నన్ను నమ్మక పోవడం నీకలవాటేగా..