నీ ఎడబాటు లో తన తోడుటుందన్న ఆశ కలిగించి
సాగుతుంది నేడు నీ తలపులు తాకగానే నన్ను విడిచి
ఎంతగా ఆపినా నా చేతిన్ని అడ్డుగా ఉంచి
ఇసుమంతైనా జాలి లేక పోతుంది నన్ను విదిల్చి
సాగింది నా జీవితం నీ జతలో తనన్ని మరిచి
నేడు ఎలా ఉండగలదు నా మాట మన్నించి
నా పై కోపమో ? నీ పై ఇష్టమో తెలియని అయోమాయపు స్దితి
కారణం ఏదైనా ఇక సాగాలి ఒంటరిగానే నా గతి
నా కన్నులు మూసి నీ కౌగిలి చేరే నా కన్నీటి ని ఆదరించి
కాలకాలం నీ పెదవుల పై నిలుపుకో చిరునవ్వులుగా మార్చి