నీ నయనాల నడుమ దూరం ఎంత?
నీ గుండె చప్పుడుకు వేగం ఎంత?
నీ ఉచ్వాస నిశ్వాసల మద్య నిడివి ఎంత?
నీ కనురెప్పలకు సవ్వడి ఎంత?
నీ అడుగులకు ఎడం ఎంత?
జవాబు నేను చెప్పనా..నీ మనసులో మాట
మన ఇరువురి మనసుల దూరమంత ....
రెప్పపాటు క్షణమంత...కన్నీటీ విలువంత
మన ఆలోచనల పరుగంత..మన మనసుల విలువంత
నీ జ్ఞాపకాల విలువంత....నీపై నాకున్న ఇష్టమంత
మన ప్రేమకున్న వయసంత.....నీ పై గుండెనిండా ప్రేమంత
నేను నిన్ను హత్తుకునేంత అంత....మనిద్దర్న్రీ విడదీయలేనంత