. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, July 11, 2011

దాచడానికేమి లేని నేను అయినా మనమధ్య తెలియని అగాధం
మనసు తడిగానె ఉంది,గుర్తొచ్చినప్పుడల్లా చెమ్మగిల్లుతున్న కళ్ళు
కాని ఆచెమ్మ కళ్ళను చేరడం లేదెందుకో మరి

నీ చెంత చేరాలని,ఏవేవో చెప్పాలని ఉంది
హృదయ బారాన్ని దింపుకోవాలని ఉంది

కాని నీ సన్నిది చేరాలంటే,నాకు సాద్యింఅయ్యే పనా
నాలోని చేతనమే వెక్కిరిస్తుంది ఎన్నాళ్ళకెన్నాళ్ళ కని

ఎక్కడ నే తడబడ్డానో తెలియక.జరుగుతున్న నిజాలు జీర్నించుకోలేక
తెలిసినట్లే అనిపించినా దిద్దుబాటులో అడుగులు జారిపోతున్నాయెందుకో?

నే నడిచే వేళలో నీతో కలిసి నడవాలని మర్చిపోతున్నా నెందుకు?
అదిసాద్యింకాదని తెల్సీ విఫల ప్రయత్నంకదా..?

క్షణ క్షణం నీకు దగ్గరవుతున్నానుకొని
నాకు తెలియకుండానే నీనుండి దూరంగా వెళ్లిపోతున్నాను కదూ ?
కాదు కాదు నీవు కావాలని నాకు దూరం అవుతున్నావు కదూ....?

దాచడానికేమి లేని నేను అయినా మనమధ్య తెలియని అగాధం

తెలిసిన ఒక శూన్యం మనసంతా,మనసులో తెలియని గందర గోళం
తెలియనిదల్లా అధిగమించాలన్న కోరికనెలా ఆచరించాలన్నదే?

నన్ను కాదనవని తెలుసు nఅయినా ఎందుకు దూరం అయ్యావు
క్షమించే నీ మనసు తెలుసు అయినా తెలియని భయం

చూసావా! నేను చెప్పాలనుకొన్న,మనసులో తెలియని ఆందోళన
విషయాన్ని కూడా నీకర్దమయ్యెలా చెప్పలేకపోతున్నాను కదూ?

ఇకపై ప్రతి క్షణం ఒకే మంత్రం,
నీవైపు చూస్తూ, నీ మాటలే మదిలో మననం చేస్తూ.

నీను చేరలేనని తెల్సి ..చేరాలనుకున్నా సాద్యింకాదని తెల్సి
మౌనంగా వెర్రివాడిలా ఆకాశం వైపు చూస్తూ ఊపిరి వదులుతా