Saturday, July 9, 2011
నీవు నన్నొదిలిన నాటినుంచి నీజ్ఞాపకాల ఊభిలో చిక్కుకున్నా..
మమతల కోవెలలో చిరునవ్వుల హరతులను నా ముంగిట వెలిగించావు,
ఏ గుడిలో నిలపను నీ స్నేహాన్ని................
ఒడిదుడుకుల ఓటములను దాటగా ఓదార్పుల మాలను అల్లావు,
ఏ పువ్వుతో పోల్చను నీ స్నేహాన్ని.....
చెమరింతల చెక్కిల్లకు చేదోడుగా నిలువగా ఇంద్రధనస్సువై వచ్చావు,
ఏ రంగుతో పోల్చను నీ స్నేహాన్ని..................
కడలిన కలిసే ప్రవహాలేన్నైనా, కలిసే చోటు ఒక్కటే.......
మన ప్రయాణాలు వేరైనా.....నడిచే మార్గమొక్కటే.......
ఎన్ని జన్మల వరమో నీ స్నేహం......
ఎన్ని తపస్సుల ఫలమో నీ స్నేహం.....
కాని ఏంలాబం స్వార్దం చూసుకొని మద్యిలో వదిలావు...
నీవు నన్నొదిలిన నాటినుంచి నీజ్ఞాపకాల ఊభిలో చిక్కుకున్నా..
బయట పడలేను..ప్రతిక్షనం గుర్తుకొస్తున్న నీజ్ఞాపకాలు..
నన్ను దహించి వేస్తుంటాయి...ఎంచేయను
ఏదో జరుగుతోంది ఏంజరుగుతోందో తెలీదు..
చివరికి నేను మిగలను అనేది మాత్రం నాకు తెలుస్తోంది ప్రియా
Labels:
కవితలు