Wednesday, July 6, 2011
నీవు నాతో లేని జీవితం నాకు వద్దు ప్లీజ్ నీవే నన్ను చంపేయి ప్రియా
నా మనసనే పూ తోటలో వికసించిన పుష్పనివా ...
నా కలలో విహరించే నా కలల రాణివా...
నను నీతో కలిసి బ్రతికించే అమృతానివా...
నీ జ్ఞాపకాలతో మరణి౦చెల చేసే విషానివా...
నను నీనే మరచేల చేసే తీపి గుర్తువా...
నను వీడి నా మనస్సుకు తగిలిన ప్రేమ గాయనివ...
ఎవరు నీవు, ఎందుకు వచ్చావు నా యదలోకి నీవు...
అంతలోనే అలా దూరం అయ్యావు, నను ఒంటరిని చేసావు...
ఈ జన్మకు నా మనసు దోచావు,
మరుజన్మకైన నీ మనసులో నాకింత చోటు ఇవ్వు నేస్తమా...?
ఏమో నమ్మకంలేదు ఈ జన్మలోనే నమ్మించి మోసం చేశావు..?
నీవే ప్రాణంగా ఉన్న నన్ను చీపోఅన్నావు..ఎందుకని అడుగలేను?
ఒకరి కోసం నన్ను దారునంగా మనసు ముక్కలు చేశావు..?
అయినా నీవంటే నాకిప్పటికీ చాలా చాలా ఇష్టం ప్రాణం..కారనం తెలీదు..
నీవు నాతో లేని జీవితం నాకు వద్దు ప్లీజ్ నీవే నన్ను చంపేయి ప్రియా
Labels:
కవితలు