Friday, July 15, 2011
నా కన్నీటి చుక్కలు ఏరులై పారుతూ వెతికేస్తున్నాయి..
ప్రియా!!.....
నీవు మిగిల్చిన శూన్యం అనే నా ఈ ప్రపంచంలో,
మన జ్ఞాపకాల దొంతర తీసి నీ చిరునవ్వులు వినిపిస్తాఏమో అని చూస్తే...
నా హ్రుదయ రోదనలు మాత్రమే వినిపిస్తున్నాయి....
నీ ఆనందభాష్పాల గురుతులకోసం ... గాబరాగా
నా కన్నీటి చుక్కలు ఏరులై పారుతూ వెతికేస్తున్నాయి..
ఏమీ అగుపడక.. ఆగిపొతాను అని మొరపెడుతున్న నా హ్రుదయ ఆక్రందన నీకు వినిపించడం లేదా!
కరిగిన కలలు..
విరిగిన ఆశల సౌధాల నడుమ..
కదలిపోతున్న కాలం అనే కడలి అలలపై తేలియాడుతూ నీకు దూరంగా కొట్టుకుపోతున్న నా దేహం,
నీ తలపుల ఝడివానలో తల్లడిల్లుతున్న నా హృదయపు గవాక్షాన్ని తట్టి జో కొడుతూ అంటుంది..
" నీ ప్రేమకు ఫలం ఇదేరా !!! " అని...నిజమేనా?
Labels:
కవితలు