Tuesday, July 12, 2011
మాట చెప్పేదెలా! మనసు తెలిపేదెలా,మనసు విప్పేదెలా,కాలం కరిగి పోతుంది
నీ కన్నులను కాంచిన క్షణం కలలు కరిగిపోతుంటే,
నీ అధారాలను చూసిన తరుణం ఆశలు ఆవిరయ్పోతుంటే,
నీ ఊపిరి తగిలిన సమయం ఊహలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే,
నీవు ఎదుటబడిన నిముషం ఎదలోని భావాలు ఎగిరిపోతుంటే,
నీ చూపులు తాకిన మరుక్షణం మాటలు మాయమవుతుంటే,
మాట చెప్పేదెలా! మనసు తెలిపేదెలా,మనసు విప్పేదెలా
కాలం కరిగి పోతుంది , కన్నీళ్ళూ ఇంకి పోతున్నాయి నీవెక్కడ,
ప్రతి క్షనం ప్రతిని నిమిషం విరహవేదనతో ఎదురుసూస్తున్నా
చాలా చాలా ఆలస్యింగా తెల్సుకున్నానేనూహించుకున్న వన్ని నిజాలు కావని..
కలలన్నీ కళ్ళలు అయ్యాయని , నిజం ఆవిరై వాస్తవం వెక్కిరిస్తోంది,
ఎందుకో ఆకాశం వైపు చూస్తున్నా నీవస్తావన్ ఆశచావక...
రాబందుకు నాకోసం ఆశగా చూస్తూ తిరుగుతున్నాయి ఎందుకో,
వాటికీ అసలు నిజం తెల్సినట్టుంది బాగా ఆకలి మీదున్నాయి ప్రియా,
నీకు దగ్గర కాలేక పోయినా రాబందువుల కు ఎర అవుతున్నానని తెలుస్తోంది
Labels:
కవితలు