Friday, July 15, 2011
చురుకైన చూపులతో నా హృదయన్ని గుచ్చేశావు
చిరుజలల్లుల చిరునవ్వులతో నన్ను తడిపేశావు
చురుకైన చూపులతో నా హృదయన్ని గుచ్చేశావు,
కొకిల స్వరంతో మైమరపించావు,
తియ్యనైన మాటలతో ఆకట్టుకుంటున్నావు,
ఒకప్పుడు ప్రేమించాను అన్నావు ,నేనంటే రెస్పెక్టు అన్నావు,
నన్ను నమ్ము మనిద్దరం మంచే స్నేహితులం అన్నావు,
నీవు మాట్లాడిన ప్రతి మాట నిజం అని నమ్మాను ,
ఆనిజం శాశ్వితం అని అదే జీవితం అని ఉప్పొంగిపోయా,
ఆ తర్వాత మరొకరికోసం నామీదకు నాగురించితెల్సి దాడి చేశావు,
తట్టుకోలేక పోయాను ఇలా చేసింది నువ్వేనా అని ఇప్పటికీ నమ్మలేకున్నా
ఎవరో గుండెను పిండేస్తున్నట్లుంది,
మనిషివి దగ్గరగా ఉండి మరి మనసుకి దూరాన్ని పెంచుతున్నావే,
నాగురించి అన్నీ తెల్సి ,నేనేంటో తెల్సి నాకిప్పుడు దూరంగా ఇలా
ఇన్ని జరిగాక నీవు నాకిక కనిపించవు మాట్లావని తెలిసాక ఏంచేయను
రవిని కాను కిరణమై నీ మనసులో ప్రవేశించటానికి,
కవిని కాను కవితనై నీ మదిలో నిలిచిపొవటానికి,
ప్రాణం కూడ తృణమే నువ్వు లేనప్పుడు
మరణం కూడా ఆభరణమే తప్పని పరిస్థితుల్లో .
నీహృదయం బడరాయి అయింది నీవు మారావు ఎందుకు మారావో తెలీదు,
Labels:
కవితలు