Saturday, July 16, 2011
నా దానివే కావాలనుకున్న నా కోరికను ఆదిలోనే తుంచేయాలనుకున్నావు...
వికసించే మల్లెలలోని పరిమళం...
తొలకరి తాకిన పుడమిలోని కమ్మదనం...
మంచువేళ తూరుపున విచ్చుకునే వెలుగురేఖల నులివెచ్చదనం...
సాయం సంథ్య వేళ చల్లగా తాకే పిల్లగాలిలోని చిలిపితనం...
ఊసులు చెప్పే నీ స్నేహంలోని మాధుర్యం...
నాకెపుడూ మధురానుభూతులే.
స్వప్నమై వచ్చి మదిలో చేరావు...
తలపుల్లో నిలిచి మనసు తలుపులు తెరిచావు...
ఎవరిలేని ఒంటరి పయనంలో నీకు తోడు నేన్నావు...
కంటనీరు చిందినవేళ నేనున్నానంటూ ఓదార్పు నిచ్చావు...
మోడువారిన జీవితంలో వసంతాలు పరిచయం చేశావు...
జీవితమంటే అర్ధం చెప్పి ఎనలేని ధైర్యానిచ్చావు...
అర్ధం లేని జీవితానికి నీవే పరమార్థమయ్యావు...
అంతలోనే ఏమైందని అలా దూరంగా వెళ్లిపోయావు...
కలనైనా నినుచూడక ఉండలేని నన్ను ఎందకు కాదన్నావు...
నీవు నాపై చూపిన అభిమానాన్ని ప్రేమనుకోవడం తప్పునుకున్నావు...
నా దానివే కావాలనుకున్న నా కోరికను ఆదిలోనే తుంచేయాలనుకున్నావు...
నాపై నీకు ప్రేమలేకుంటే ఇదంతా ఎందుకు చేశావు...
ప్రేమే నేరమనుకున్న నీవు ఆ ప్రేమను నాకెందుకు పరిచయం చేశావు...
చెప్పు ప్రియా... ప్రశ్నిస్తేనే జీవితమన్నావు... నా జీవితం కోసం నేడు నిన్ను ప్రశ్నిస్తున్నాను... నా ప్రశ్నకు బదులివ్వగలవా... ?
Labels:
కవితలు