...మనసాతుళ్ళీ పడకే...అతిగా ఆశపడకే..నాకిష్టమైన పాట అందుకే ఈ పాట నా బ్లాగ్ లో టైటిల్ గా పెట్టాను ..ఈ పాటవింటుంటే నామనసు ఎక్కడెక్కడో విహారిస్తున్నట్టు ఉంటుంది...ఒక్కోసారి మనం ఎన్నో ఉహించుకుంటాం...అన్నీజరగవు..ఊహ అనేది మనిష్టం అది జరగటం జరుగకపొవడం మనచేతుల్లో ఉండదు...అయినా ఈ పాట నన్ను...ఎక్కడికో తీసుకెలుతుంది...ఈ పాట శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోది...ఊహల్లో తనకిష్టమైనవారిని ఉహించుకొంటూ పాడేపాటాయినా .... ఆ పాటలో ఉహ ఎక్కువున్నా నిజమైతే ఎంతబాగుండు అనే మీనింగ్ నాకు ఎంతోనచ్చింది..తనకిష్టమయిన వ్యక్తికోసం ఓ అమ్మాయి పాడేపాట ఇలాంటి అమ్మాయి కావాలని ఎవ్వరైనాకోరుకుంటారు..అది అందరికీ దొరకదు ఆ ఆధౄష్టం కొందరికే...అందుకే ఆపాటలో...ఊహల్లో ఊహించుకోకాని అతిగా ఆశపడకు అని మనసుకు సర్థి చెప్పుకుంటూనే..ఆ సుభగడియకోసం ఎదురుచూస్తున్నా అని ఓ యువతి పాడుకునే అద్చుతమైన పాట..తను ఇష్టపడ్డ వ్యక్తిగురించి ఊహల్లో తేలుతూనే అతనిని నచ్చానోలేదో అని ఎక్కడో చిన్న భయం..తన కిష్టమైన వ్యక్తి దక్కాలంటే..ఏ పూజలు చేయాలంటూ..తన ఊహల్లో పాడుకునే పాట మీరు చూడండి ఆ విడియో కూడా పోష్టు చేస్తున్నా ....