Saturday, January 1, 2011
వెల కట్టలేని వెన్నెల "స్నేహం"
"స్నేహమా"
ఏమని చెప్పను ...
విస్తరించిన వెల కట్టలేని వెన్నెల "స్నేహం"
మలినం లేని మృదువైన మౌనం "స్నేహం"
బంధుత్వం అవసరం లేని బలమైన బంధం "స్నేహం"
మమతలతో మైమరపించే మహా మాయ "స్నేహం"
ఆప్యాయతలతో అలరించే అనుబందం "స్నేహం"
వివరణలు అడగని విలువైన వాస్తవం "స్నేహం"
నిరూపణలు కోరని స్వచమైన నిజం "స్నేహం"
సరిగమలు అక్కర లేని వినసొంపైన సంగీతం "స్నేహం"
ప్రేమానురాగాలకు నిజమైన ప్రతిరూపం "స్నేహం "
కరుణ ,సహృదయతలకు కావ్య రూపం "స్నేహం"
కొందరికే సొంతం ఈ అపురూప వరం ఈ స్నేహం ...
"అమె" మన నిజమైన "శ్రేయోభిలాషి"
కొన్ని బాధలను వైద్యులు కూడా గుర్తించలేదు కానీ స్నేహితుడు గుర్తిస్తాడు ...
దేవుడు కూడా మాన్పలేని గాయాల నెన్నింటినో స్నేహం మాన్పుతుంది ...
అందుకే ఈ చిరు కవిత అలాంటి ప్రియ మిత్రులకు అంకితం ...