Wednesday, May 4, 2011
అవన్ని ఒకప్పిటి నిజాలు ..ఇప్పటి అబద్దాలుగా మారాయి..
నాపై ప్రసరించిన నీ తొలిచూపుల కిరణాలు
నా హృదిలో ప్రేమ వీణను మీటాయి
నాపై విసిరిన నీ చిరునవ్వుల బాణాలు
నాలో మల్లెల విరివానలు కురిపించాయ్
ఒకానొక రోజున అంటీ అంటనట్లు తగిలిన నీ చేతి స్పర్శ
ఒక్కసారిగా నా మనస్సును మత్తెక్కించింది
ఒంటరిగా ఉన్న నీ మనసుకు తోడుకావాలన్నప్పుడు
ఒట్టు... అది కలయేమోనని భ్రమపడ్డా
అది కలకాదు నిజం అని నీ వెచ్చని స్పర్శ చెప్పింది
అది కల్లకాదు నిజమేనని నీ పెదవులు చెప్పాయ్
ఆ తరువాత తెల్సింది అది ఒకప్పటి కల అని
నిజంగా నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి..
అవన్ని ఒకప్పిటి నిజాలు ..ఇప్పటి అబద్దాలుగా మారాయి..
ఎమైందని ఆలోచించే లోపు అన్నీ జరిగిపోతున్నాయి....
ఏంజరుగుతుందో అర్దంకావడంలేదు..మనస్సు భాదపడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నా..
నిజం..ఎదో అబద్దం ఏదో అర్దకానంత గుండెలనింటా ఆందోళన..
ఇవన్నీ తెలీయని ఒంటరి లోకాలకు పోవాలని కోరుకుంటున్నా..?
ఈ లోపు నీతో ఒక్కసారి మాట్లాడాలని
నీ రాక కోసం...
నీ పలుకు కోసం...
నీ పిలుపు కోసం...
ఎన్నాళ్లయినా... ఎన్నేళ్లయినా...
అది నాశ్వాస ఆగిపోయేదాకేకదా చూసేది.ఆ తర్వాతా...?
Labels:
కవితలు