Monday, May 23, 2011
ప్రియతమా....నిన్ను ఏమని పిలవను?
ప్రియతమా!
ఏమని పిలువను...
మనసు అలజడితో ఊగుతున్నప్పుడు..
నమ్మిన విశ్వాసం ఆ విశ్వాసం సాక్షిగా చెదురుతున్నప్పుడు..
బ్రతుకు ప్రశ్నార్థకమై చౌరస్తాలో నిలిచినప్పుడు..
నేనున్నానంటూ పలకరించావు
నీకు నువ్వు నాకు నేను అంటూ
ప్రపంచం సాక్షిగా..
మనం నడకను కొనసాగిద్దామంటూ...
మనిషితనం మన పునాదిగా చేసుకుందామంటూ...
నువ్వొచ్చావు.
ఆశాజీవనలతలను మోసుకుంటూ నువ్వొచ్చావు..
సెలయేటి పాటలా నువ్వొచ్చావు..
నువ్వూ నేనూ లేని జీవితం..
నీకూ నాకూ లేని జీవితం..
జీవితం కాదంటూ
నువ్వొచ్చావు...
సువిశాల జగతిలో మనిషికి ఎంత చోటు కావాలంటూ...
ఎందుకు జీవించలేమంటూ...
ఒక పురావిశ్వాసాన్ని తలపుకు తెస్తూ...
నువ్వొచ్చావు..
నీ నవ్వుల్తో కవ్వించావు..
నీ చూపుల్తో ఆశపి రేకెత్తించావు..
నీవులేంది నేను లేనని మాయచేశావు..
ఎమైందో తెలీదు..నన్నుదోషిని చేసి వెల్లీపోయావు..
నన్ను అన్యాయంచేది అందనంత దూరం వెళ్ళీపోయావు..
నీవు లేని జీవితం నాకొద్దు అంటే ఆనందింస్తున్నావు..
ఆరోజు ఎప్పుడొస్తుందా..వీడెప్పుడు పోతాడాని ఎదురు చూస్తున్నావు..
నీవెందుకిలా చేస్తున్నావని అడుగలేను నాకా అర్హత లేదని తేలింది..
ప్రియతమా....
ఏమని పిలువను?
నిన్ను ఏమని పిలవను?
Labels:
కవితలు