Monday, May 16, 2011
మనసు దోచిన ఆ నయనాల వెంట పయనానికి సిద్ధమయ్యాను..
వికసించే మల్లెలలోని పరిమళం...
తొలకరి తాకిన పుడమిలోని కమ్మదనం...
మంచువేళ తూరుపున విచ్చుకునే వెలుగురేఖల నులివెచ్చదనం...
సాయం సంథ్య వేళ చల్లగా తాకే పిల్లగాలిలోని చిలిపితనం...
ఊసులు చెప్పే నీ స్నేహంలోని మాధుర్యం...
నాకెపుడూ మధురానుభూతులే.
వెన్నెల రేయి కొలనులో విచ్చుకున్న కలువల్లా...
అల్లరిగా నా చూపును తాకి...
పులకింతలు మరచిన మదికి గిలిగింతలు నేర్పించి...
మనసు దోచిన ఆ నయనాల వెంట పయనానికి సిద్ధమయ్యాను..
అందమైన ఆశల్ని ఆనందంగా రేపి...
తపించే మనిషిని చూచి వెక్కిరింతల కేరింతలు కొట్టే నీకు తెలియదు సుమా...నేనేంటో
ఆ మనిషే ఓడిననాడు కలిగే అపజయాల గాయాలు భరించాల్సింది నేనేనా.
ఒకటి మాత్రం నిజం నేను ఓడిపోయాను..నీవుకూడా నన్ను ఓడించావు ..
ఎవరి కోసమో మనస్నేహాన్ని బలి చేస్తావని నేను అస్సలు ఊహించలేదు..
ఒకే ఒక్క మాట..
ఇంకేం చెప్పలేను..
నీవు లేని నేను లేను..అని నీకు కూడా తెల్సు కాని .నన్ను ..?
Labels:
కవితలు