అప్పుడప్పుడు ఎలావున్నావంటూ
ఒక్కపలకరింపు చాలు
నేను గుర్తొచ్చినప్పుడల్లా
నీ పెదాలపై నవ్వులు పూస్తే చాలు
సంతోషమైనా,బాధయినా
నేనుంటే బాగుండుననిపిస్తే చాలు
మన మధ్యనున్న వేల జ్ఞాపకాలు
కొన్నయినా మధురం గా అనిపిస్తే చాలు
చాలు….నా స్నేహానికిది చాలు
మనిషి కీ,మనిషికీ
మనసుకు,మనసుకూ మధ్య
ఈ మాత్రం వారధి చాలు …………
నాకీ చిన్ని సంతోషంకూడా లేకుండా చేస్తున్నా వెందుకు.
నాకు ఆమాత్రం అర్హతలేదేమోకదా..?
Dr..Love