Monday, May 16, 2011
పడవప్రయానంలో నడి సముద్రంలో వదలి వేశావు
పడవప్రయానంలో నడి సముద్రంలో వదలి వేశావు..
అలలు తాకుతున్న పడవను నేను..అప్పుడొచ్చావు నేనున్నాను అంటూ నా పడవలోకి..
ఏన్ని అలలు నా జీవితం అనే పడవను తాకినా నాకేంకాదనే దైర్యం కారణం నా పక్కన నీఉండటం..
అప్పుడనిపించింది ప్రపంచంలో నాకంటే అద్రుష్టవంతుడు లేడని అలా సాగుతున్న నా పడవకు మరో అలల తాకిడి
అయినా లేక చేయకుండా సముద్రాన్ని ఈదుతున్నా కారనం నీవు నాపక్కన ఉన్నా వనే దైర్యం..
ఎందుకో మనసులో అలజడి పక్కన చూస్తే నీవులేవు..ఎమైందో తెలీదు మరో పడవలో ఆనందంగా ఎక్కి వెళ్ళి పోతున్నావు..
నడి సముద్రంలొ నన్ను ఒంటరిగా ఒదలి ...అప్పటికే అలలు తాకిడి ఎక్కువైంది ఏనిమిషం అయినా నా పడవ మునగొచ్చు
అన్నీ చూస్తున్నావు..నా పడవ అలల తాకిడికి కిందా మీద అవ్వడం చూస్తూనే ఉన్నావు ఎందుకో నవ్వుతున్నట్టు అనిపించింది..
అలా నీవు మరొకరితో హేపీగా..వెల్లిన పడవ వడ్డున చేరింది నీవు మాత్రం హేపీగా వున్నావు.. అల్లలో అల్లాడుతున్న నా పడవను చూసి..
ఎక్షనం అయినా నాపడవ మునికి పోవచ్చు..
అలలు పెరుగుతున్నాయి ఇప్పటికే పడవలో నీళ్ళూ కూడా వచ్చాయి నా పడవ వడ్డుకు వచ్చే అవకాశం లేదు
Labels:
కవితలు