నీ ఊహలతో బ్రతికే నాకు తెల్లవారుతుంటే భయం
కలలోనైనా నీతో మనస్పూర్తిగా గడపాలనుకుంటే
చీకటికి కూడా విస్సుగ్గా ఉంటుందేమో
ఒక కల చెదిరిపోక మునుపే
నేనువున్నానంటు వస్తుంది వేకువఝాము
నీతో నేనువున్ననానుకొని భ్రమలో
నీ వెంట సాగుతుంటే
ఉలికిపాటుతో నన్ను మేల్కొలుపుతుంది
సూర్యభానుని వుదయకిరణం
పగలంతా నా సహనానికి పరీక్ష పెడుతుంది
నిన్ను గుర్తుకు తెచ్చుకోకుండా వుండాలంటే
మొదట నిన్ను నే మర్చిపోవాలిగా
ఆ మరుపే నాకు సాద్యం కాకుండా వుంది
నిశ్శబ్ద నిశీధిలో నీతో వొంటరిగా
సుదూర తీరాలకు సాగిపోవాలనే ఆశ
నిరాశేనని నాకు తెలుసు మిత్రమా!