Tuesday, May 17, 2011
మనసులో ఆరాటం నిజంగా నీవు దూరం అవుతున్నావేమో అని..
నువ్వు ఎదురుగా ఉన్నంతసేపు
గంటలైనా క్షానాల్లా గడచి పోతాయ్
నీ కళ్ళు నవ్వగలవని
నీ పెదాలు మాట్లాడగలవని
నీలోను చైతన్యంవుందని
నా హ్రుదయం హెచ్చరిస్తుంది......
గుప్పెట జారిన ఇసుకలా కాలము
కరిగే కలలా జారిపోతుంది
వెళ్ళోస్తానంటూ నువ్వు బయలుదేరుతావు
వద్దంటూ నిన్ను పట్టి ఆపాలని నా హస్తం
అప్రయత్నంగా నీకు టాటా చెబుతుంది....
మనసులో ఆరాటం నిజంగా నీవు దూరం అవుతున్నావేమో అని..
అప్పుడు ఎంత భపడ్డానో అంతకంటే ఎక్కువే జరిగింది
ఏది జరగ కూడదనుకున్నానో అదే జరిగింది
తిరిగి రాని వసంతం లా నీవు వెల్లిపోయావెందుకు
ఒకప్పుడు నీవే అన్నావు నీవు ఏలాంటి తప్పుచేయవని
మరి ఏం తప్పు చేశాను అని నన్ను వీడి పోయావు..
గుండెల్లో తీరని భాదగా ఎందుకు మిగిలిపోయావు
నేటిని నిన్నగా మార్చే రేపుకై
ఎప్పుడు మాట్లాడుతావని చూసే రేపటి నీ రాకకై
ఎదురు చూడటం తప్పించి ఏమీచేయలేని వాడిగా మిగిలా
నీకొసం నిరీక్షిస్తుంటాను "నీ" నేస్తాన్నై...."నే" బ్రతికుంటే కలుద్దా..
Labels:
కవితలు