ముందుగా ఎలా జరిగింది మన పరిచయం..
అంతలోనే ఎమైంది..ఇప్పుడిలా
ఒకప్పుడు క్షనం కూడా వదలి ఉండలేనట్టున్న మనం..
ఇప్పుడు బద్ద శత్రువుల్లా..?
జీవితంలో తెలియని అల్ల కల్లోలం..
గుండెల్లో ఆందోళన..
ఓపలేనంత బరువు...తట్టుకోలేనంత చీకటి
ఆపలేనంత పరుగు..చేరలేనంత దూరం
చెప్పలేనంత దిగులు
ఎటు చూసిన హేళనలు ,అక్కర్లేని సానుభూతులు
మింగలేనంత చేదు అనుభవాలు
అందుకే నాగుండే తట్టుకోలేక ఆగిపోతుందనిపిసుంది..
ఈ భాద బరించేకంటే ఇదే మేలేమో కదా...?