Thursday, May 26, 2011
నీ జ్ఞాపకాల దోంతరలో ఎన్నో మధురాను భూతులు..
నీ జ్ఞాపకాల దోంతరలో ఎన్నో మధురాను భూతులు..
మనిషి లోని మనసును కదిలించే మధురాను బూతులు..
ఇప్పటికీ ఏక్కడో చిగుర్తిస్తున్న చిన్ని ఆశ..నీవొస్తావని..
నీ జ్ఞాపకాల గుర్తొచ్చినప్పుడు వచ్చే కన్నీటి చుక్కలలో కదిలే నీరూపం..
ఎగిచి పడే అలలా నీదగ్గరకు వద్దాం అనుకుంటాను కాని పట్టించుకోవు..
అలలా వచ్చి కలలా మిగిలినా నీజ్ఞాపకాలు మరువలేకున్నా తెలుసా
మూగమనస్సు పలికే ఎన్నో భావాలు నీతో పంచుకోవల్ని వుంది కాని..?..
నోతో గమ్యింలేని ఎంత దూరం అయినా నడవాలని ఉండీ కానీ నీవు..?
నీవు లేవన్న భాదను భరించేందుకు నా ఈ గుప్పెడు గుండే చాలడంలేదు..
పట్ట పగలు సూరీడు వచ్చినా నాకు చీకటి గానే ఉంది..ఎందుకో తెలీదు
రాత్రికి పగలుకు తేడా తెల్సుకోలేనంత వెర్రివాడిగా మారిపోయాను ప్రియా
చుట్టూ ఎంత సందడిగా ఉన్నా నాకు నిశ్శంగా నే ఉన్నట్టు అనిపిస్తోంది..
కలలో కనిపిస్తావేమో అని ఆత్రంగా ఎదురు చూస్తున్నా నిద్దురే రావడం లేదు
Labels:
కవితలు