Saturday, May 21, 2011
ప్రేమలో నిజాయితీ అవసరం లేదనుకుంటా....?
ప్రేమలో నిజాయితీ అవసరం లేదనుకుంటా..
మాయమాటలు చెప్పే వాళ్ళదే నమ్ముతారు..
మాయ చేసే వాళ్ళే నిజమైన ప్రేమికులని అనుకుంటారు..
నిజమైన ప్రేమను గుండెల నిండాపెట్టుకోని ఆరాధిస్తే మిగిలేది సూన్యిం..
అలాంటి నిజమైన ప్రేమను ఎవ్వరూ నమ్మరు..అలాంటి ప్రేమ ఎవ్వరికీ అక్కరలేదు
నిజం చెప్పాలంటే!
అసలు నిజమైన ప్రేమంటే ఏంటి..?
ప్రేమంటే ఎవరెస్టుకంటె ఎత్తైనది,
ప్రేమంటే ఆకాసమంత పరచుకున్నది,
ప్రేమంటే బాధకంటె బరువైనది,
ప్రేమంటే అగ్నికంటె స్వఛ్ఛమైనది,
ఎవరు భరించగలరు ఇటువంటి ప్రేమను!.. అందుకే,
ఆ పిచ్చి ప్రేమను హ్రుదయగవాక్షాల మధ్య బంధీ చేసే వాళ్ళను,
అటువంటి వాళ్ళను పిచ్చి నాకొడుకులుగా బావిస్తారు
ప్రతిక్షనం వూహల రెక్కలకు సంకెళ్ళు వేస్తున్నా,
నీ ఆలోచనలతో కలల మొగ్గలు చిదిమేస్తున్నా,
నీగురించి ఆలోచిస్తూ ఆశల సౌధాలు కూల్చేస్తున్నా,
నీవుదూరం అయి మనసుభారంగా మౌనరాగం ఆలపిస్తున్నా!
అందుకే ఇకపై...నీవు మిగిల్చిన భాదతో
నీవు మిగిల్చిన ఏకాతంలో,
ఏ కాంతీ లేని, జీవితం జీవిస్తూ!
నీవు విదిల్చిన ఒంటరితనంలో,
ఒంటరిగానే ఈ తనువును చాలిస్తా!
Labels:
కవితలు