చెరిగిపోని చిరునామా నీవై,
చెదరని చిలిమి గాయం నీవై,
కలగా మారి కలతలు నాకు మిగిల్చి,
కాటిన్యం గా కదిలిపోయావు...
కరుణ మరిచి కలవరపరిచావు ..
కరిగిపోవదని కలని అడగనా వేకువ సంధ్యలో ...
వెళ్ళవద్దని నిన్ను కోరనా విడిన ఈ సమయంలో...
నిర్నిమితం గా నన్ను ఒంటరి లా వదిలి నిలువని నీ నడకల లో నడవాలని నేనడుగుతున్నా...
ప్రేమే మరచి విడిపోతున్నా నా ప్రాణానికి నీడనై ఉండాలని నే ఆశ పడుతున్నా ....
బహుశా ..
ఎంత ఆశ అందని తారాలోకం కోసం నిచ్చెన వేస్తున్న నీ నిచ్చెలి మది అరాదన బావాసారం ...కరగని కాలం లో
క్షణాలు క్షణికాలు కాలేవా,
నిముషాల నిరీక్షణ నశించదా.....
నీ ధ్యాసలో ప్రాణం వీడి పోదా ....