Tuesday, May 31, 2011
ఎక్కడున్నావు నీవు..వెతుకుతున్నా నీకోసం.
ఎక్కడున్నావు నీవు..వెతుకుతున్నా నీకోసం.
ఎన్ని రోజులైంది నిన్ను చూసి అందుకే వెతుకుతున్నా..
ఎక్కడన్నా వని వెతకను...అన్ని చోట్ల్ వెతుకుతున్నా..
నీకు పుస్తకాలు చదవడం ఇష్ట అని బుష్టాల్స్ లో వెతికా ..
సాయంత్రం ప్రెండ్స్ తో సరదాగా పార్కుకెలతావని అక్కడా వెతికా..
సంగీతం నేర్చుకుంతున్నావని సంగీతం కలాశాల్లో వెతికా..
ఇల అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్ల్ వెతికా..
వెతికి వెతికి అలసిపోయి..రాత్రి నిద్రపొదామని ట్రైచేశా..
ఎందుకో నిద్దుర పట్టలేను..బలవంతంగా నిద్రపోవాలని ట్రైచేశా..
నీజ్ఞాపకాలు నాకు నిద్దుర లేకుండా చేస్తున్నాయి..
ఎందుకొ ప్రశాంతంగా నీగురించి తలచుకొంటూ..
నా కళ్లు మూసుకొని మనసు ద్వారాలు తెరిచా..అక్కడనీవు..
నా హ్రుదయంలో ప్రశాంతంగా నిద్రుపోతున్నావు హాయిగా..
నీవు దేవతలా వెలిగిపోతూ చిన్నపిల్లలా నిద్రుపోతుంటే..
కన్నార్పకుండా లాగే చూడాలనిపిస్తుంది..
ఎక్కడ నా కనురెప్పకొడితే నీ నిద్రచెడిపోతుందేమో ..
అని భయం గా నీ వైపేచూస్తున్నా..అలాగే కన్నార్పకుండా
కదిలితే ఎక్కడ నీ నిద్రచెడిపోతుందని నిన్ను అలాగే చూస్తున్నా..
ప్రపంచంతో ఎలాంటి సంబందంలేనట్టు ఎంత హాయిగా నిద్రపోతున్నావు..
చూశావా అన్ని చోట్ల్ వెతికిన నేను ...ఎందుకో నిజాన్ని మరిచానో కదా..?
నీవు నాహ్రుదయంలోనె ఉన్నావనే నిజాన్ని మర్చాను..
ఇక ఎప్పుడూ నిన్ను చూడాలనుకుంటే ఎక్కడా వెతకను..
హాయిగా కళ్ళు మూసుకొని నాహ్రుదయద్వారాలు తెరిస్తే అక్కడే వున్నావుకదా..?
Labels:
కవితలు