Tuesday, May 31, 2011
ఏం చెప్పను విరిగింది నా మనసేనని .......నీవు హేపీగా ఉన్నావు
ఏం చెప్పనులే ఇక విరిగింది నా మనసేనని .......
నన్ను పొమ్మంది నా ప్రాణామేనని........
నన్ను ముంచే నది నా కన్నీటిదేనని.....ఏం చెప్పను..
మనిషి కాలిపోయేది చితిలోనేనని ....
మనసే చచ్చిపోయాక దేహం ఉంటే ఎంత పోతే ఎంత ప్రియా
తనువు మనసు నిండాయి అన్నీ నీ జ్ఞాపకాలే ...
మరిచే దారి తెలియక మానై నిలిచానని ....ఏం చెప్పను...
ఏకాంతన్నే ప్రేమిస్తానని ఎప్పటిలాగే ...అంతకంటే ఏంచేయను
ఇక ఏ బంధాన్ని నమ్మను నమ్మితే చివరకు మోసపోవడమే కదా .
అందరూ నమ్మించి మోసం చేస్తున్నారు..చివరకు నీవుకూడా
పున్నమి వెలుగులు మింగేసేది అమావాస్య రాత్రేనని .......
అంతకు మించిన చీకటిని నాజీవతంలో వదలి వేశావు..........
నీకోసం గుండెలు పగిలేలా ఏడుస్తున్నానని నీకు తెల్సా......
నా కంట్లో కన్నీరు ఎప్పుడో ఇంకిపోయింది .
ఏకాంతన్నే ప్రేమిస్తానని ఎప్పటిలాగే ......అంతకంటే నాకు గతిలేక
ఇక ఏ బంధాన్ని నమ్మను నమ్మినా నాకు మిగిలేది...ఏముంది కదా..?
Labels:
కవితలు