Saturday, May 14, 2011
చలం రచనల్ని తెల్సుకునే ప్రయత్నం చేస్తున్నా...?
నాకు పుస్తకాలు చదివే అలవాటుంది కాని అది స్కూల్ లో ఉన్నప్పటి మాట...సమయాభావం వల్ల చదలేకపోయా...నవలలు చదివేవాడిని కాని సాహిత్యిం చలం లాంటి లోతైన రచనలు చదవలేదు..చదివే అవకాశం రాలేదు..కొంతమంది చలంగురించి చెప్పారు..మైదానం అనే పుస్తకాన్ని చదవాలని ట్రైచేశా అర్దం చేసుకోవడానికి సమయం పట్టింది ....అప్పటి సమాజంలో నిజాన్ని నిర్బయంగా చెప్పాడు..ఏవ్వరికీ తెలియకుండా జరుగుతున్న ఘటనలను కళ్ళకు కట్టినట్టు నట్టు చెప్పాడు చెలం తన రచనల్లో ...అప్పటినుంచి చలంగురించి తెల్సుకుందాం అనుకున్నాకాని కుదరలేదు...అనుకోకుండా స్నేహితుని నరేష్ నందన్ వద్దనుంచి చలం పుస్తకాలు తెచ్చుకున్నా సమయం కుదిరినప్పుడు చదవడం మొదలు పెట్టా..నేను చదివి అర్దం చేసుకుంది మీతో షేత్ చేసుకోవాలనుకుంటున్నా..
చలం గురించి నేను తెల్సుకున్న కొన్ని విషయాలు..
స్ర్తీల విద్యకు, ఆర్ధిక స్వాతంత్య్రానికి బాటలు వేసిన- బాలికా పాఠశాలలు పెట్టి, వితంతు వివాహాలు చేసి స్ర్తీకి చేయూతనిచ్చిన వారొకరు, వెరూ ఆలోచించని విధంగా స్ర్తీ హృదయానికి, దాని స్పందనలకు ప్రాధాన్యతనిచ్చి స్ర్తీల తరపున ప్రపంచంతో వాదించి అనేక రచనలతో స్ర్తీ హృదయానికి అద్దం పట్టిన వారు.స్ర్తీ జనాభ్యుదయ వాది గుడిపాటి వెంకటా చలం..ఈ నాటి స్ర్తీ పరిస్థితిని, స్ర్తీ స్వేచ్ఛని ఒక్క సారి పునరాలోచించడం అవసరం. ‘స్ర్తీకి శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి’ అన్నాడు గుడిపాటి వెంకటా చలం. ప్రపంచీకరణ నేపథ్యంలో మార్కెట్ ఎకానమీ, ప్రైవేటీకరణల సంధి కాలంలో స్ర్తీని ఏ దృష్టితో చూస్తున్నారో, ఎంతవరకు ఆమెకు చలం చెప్పిన మాటలను అన్వయిస్తున్నారో- అమలు పరుస్తున్నారో అందరకూ తెలుసు.
చలం స్ర్తీల విషయంలో లోతుగా ఆలోచించి, అధ్యయనం చేసి స్ర్తీలు ఎన్ని విధాలుగా అణచివేతకు గురవుతున్నారో- మానసిక హింసకు బలవుతున్నారో తన రచనల ద్వారా లోకానికి తెలియజేశాడు. అంతే కాకుండా సాంస్కృతికంగా స్ర్తీల అణచివేతను బహిర్గతం చేస్తూనే- వారి మనస్సు ఎంత కోమలమో, ఎలాంటి స్వేచ్ఛను వారికి అందించాలో, స్ర్తీల మనోగతాలేమిటో అద్దం పడుతూ స్ర్తీ చైతన్యం ప్రధాన భూమికగా రచనలు చేశాడు. కందుకూరి- అన్నెం పున్నెం ఎరుగని బాలికలను ఆడుకునే వయస్సులో ‘పెద్దయ్య’ లాంటి పెళ్ళికొడుకులకిచ్చి పెళ్ళి చేయడాన్ని ‘బ్రహ్మ వివాహం’ అనే ప్రహసనంలో దుయ్యబట్టాడు.కట్టుబాట్ల ముసుగులో స్ర్తీ జీవితాలను హింసకు గురిచేయడాన్ని అధిక్షేపించారు. ఆ వేదనతో రచనలు చేశారు. కానీ స్ర్తీ పరిపూర్ణ స్వేచ్ఛ పట్ల, మహిళా చైతన్యపు సాధికారత పట్ల సీరియస్‌గా ఆలోచించ లేకపోయారు. కారణం- ఆ నాటి పరిస్థితులు అలాంటివి. మెకాలే ఆంగ్ల విద్యా ప్రభావం 1857లోనే ‘జానకమ్మ’ లాంటి స్ర్తీలను చదువరులను చేయగలిగింది.
ఇలా చలం పుస్తకాల గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది..మరోసారి నేను చదివిన కధలను బ్రీఫ్ గా తెలిపే ప్రయత్నం చేస్తా
Labels:
జరిగిన కధలు