కాలం నన్ను పగపట్టింది..అది నన్ను బ్రతక నీయదేమో...
ఎందుకిలా జరుగుతుందో... అదీ నాకే ఎందుకు జరుగుతుందో తెలీదు..
పగవాడికి కూడా ఇలా జరుగకూడదు..అనిపిస్తుంది
అందరూ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో తెలీదు...
కారణం కర్మ అని అనుకోవాల్సిందేనా..
జరుగుతున్న కారనాలు తల్సుకుంటే కన్నీటి ప్రవాహం ఆగటంలేదు...
ఎవరు నీవంటు చివరకు నామనస్సే నాకు ఎదురు తిరుగుతుంది...
మనస్సును తప్పు పట్టలే...మనుషుల్లోనే ఇన్ని మార్పులొస్తే ..
నా మనస్సే నాకు ఎదురు తిరగటంలో ఆచ్చర్యం ఏముంది కదా..?
మర్చిపోదామనుకున్నా మానని గాయాలు...కాలి బూడిదైన గతం
మన గతాన్ని బూడిదచేసి ప్రస్తుతంలో నీవు హేపీగా ఉన్నావు కదా..