Wednesday, May 25, 2011
ఆ వ్వక్తికోసం నన్ను..మానసికంగా చంపేశావు..?
ఆటుపోట్ల మధ్య,
అభిజాత్యాల మధ్య,
హృదయాలకు తగులుతూ వచ్చిన
పెనుగాయాల మధ్య..
సంచలనాత్మక సంఘటనల మధ్య
చెదిరిపోయిన అనుబందం మనది..
అయినా ఒక్కోసారి
మనం అర్థం కాము..
మనకు మనం అర్థం కాము..
మనం ఇతరులకు అర్థం కాము..
ఇతరులు మనకు అర్థం కారు..
మనకు ఇతరులు అర్థం కాకుంటేనేం..
మనకు మనమే అర్థమే కాకపోతేనే..
ఏమిటి, ఎందుకు, ఎందుకిలా..
మనం విశ్వసిస్తున్నా..
ప్రగాఢంగా విశ్వసిస్తున్నా..
దేవుని సాక్షిగా మోసం చేశావు
విశ్వసిస్తూనే తూట్లు పొడిచావు.
అనుమానాలు కాదు
ద్వేషానలాలు కాదు..
మాటలతొ నా పై యుద్దం చేశావు..
మనిషిని మానసికంగా చంపేశావు
మౌనంగా చంపేస్తున్నావు..
ఆ వ్వక్తికోసం నన్ను..మానసికంగా చంపేశావు..
అంతగా ఆవ్యక్తిని ఇష్టపడి ఇలా ఎందుకుచేశావు..
నన్ను ఇష్టపడ్డానని చెప్పి మోసం చేశావు..
నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు..
ఇప్పుడు నా చావుకోసం ఎదురు చూస్తున్నావు కదూ..?
Labels:
కవితలు