. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, May 24, 2011

మంచి స్నేహితుడు దూరం అయిన రోజు...?




పైన ఫొటోలో చిరునవ్వును చిందిస్తున్న వ్యక్తిని చూస్తే ఏమనిపిస్తుంది....అంత కూల్ గా ఉండే వ్యక్తి...పేరు దివాకర్.. మా జీ 24 గంటలు చాలనల్ లో డెస్క్ లో పని చేస్తాడు...ఇద్దరం మంచి మిత్రులం...ఎందుకంటే... నేను సెకండ్ షిఫ్ట్ డ్యూటి సమయంలో ఇద్దరం కల్సి బయటకు వచ్చేవాళ్ళం...మామూలుగా చాలా కూల్ గా ఉంటాడు దివాకర్....ఆఫీనుంచి మొదలు మెహిదిపట్నంపోయేవరకు నేనే ఏదోటి మాట్లాడు తూనే ఉంటాని..... అన్ని విషయాలు మాట్లాడుకొంటూ వెలతాము ..నేను చెప్పే ప్రతి విషయానిని ప్రతిసమాదానం అవునా అని మాత్రమే...కాని ఎందుకో ప్రతిరోజు ఇద్దరం కల్సి వెల్లేప్పుడు నాకు భాద అనిపించినా , ఆనందం అనిపించినా అన్ని విషయాలు చెబుతుంటాను... అన్నీ వింటాడు అవునా అంటాడు కాని నేను నాన్ ష్టాప్ గా అలా చెబుతూనే ఉంటాను..అలా నేను 2 ,10 డ్యూటి సమయంలో అలా మొదలైంది ఇద్దరి పరిచయం...ఏంటో ఈరోజు ఆఫీసుకు వెల్లగానే షాకింగ్ న్యూస్..దివాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని ...కాని నమ్మలేకపోయా ఆఫీసులో విషాదచాయలు...నాలుగు రోజుల క్రితమే కొత్తగా పెళ్ళి అయింది..కాని నేను వెల్లలేకపోయా ఎక్కడ తను ఆఫీసుకు రాగానే తిడతాడో అని భయపడుతున్నా మా అందరిని విడచి అనంత లోకానికి పోయాడని..విషయం తెలియగానే ..చెప్పలేనంత భాద అనిపించింది నా భాదను షేర్ చేసుకునే స్నేహితుడు నన్ను మోసం చేసి ఎక్కడికో పోయాడనే భాద ఈ రోజు ఏపనీ చేయనీయలేదు...దివాకర్ లాంట్ మంచి వ్యక్తుల్ని దేవుడు తొందరగా ఎందుకు తీసుకేల్లాడు..అదేదో నాలాంటీ వాడీని తీసుకెలితే భూమికి భారం తగ్గేదని ఎన్ని సార్లు భాద పడ్డానో... ఏంటో నాకు చాలా చెప్పాలని ఉంది కాని మనస్సులో దివాకర్ తో మాట్లాడిన మాటలు అన్ని గుర్తుకు వస్తున్నాయి కంట కన్నీరు ఎప్పుడు దూకుదామాని చూస్తున్నాయి...దివాకర్ నిజంగా మా అందర్నీ మోసంచేశాడు... ఆత్మహత్యి ఎందుకు చేసుకున్నావని చొక్కా పట్టుకొని నిలదీయాలని ఉంది కాని చెప్పకుండా అనంత లోకాలకు వేల్లి మా అందర్ని ఓటరి వాళ్ళను చేసి వెల్లాడు.

ఇంత కంటే ఏంచెప్పలేనిప్పుడు కొత్తపేళ్ళి కూతురు దివాకర్ బ్యార్యి..దివాకర్ కుటుంబసభ్యులకు మనస్సాంతి కలగా లని దేవున్ని కోరుతూ
.మీ
స్నేహితుడు " ఇన్నారెడ్డి "

ఉన్నట్టుండి అకస్మాత్తుగా దివాకర్ వెళ్లిపోయాడు..
చెట్టును వీడి గాలి, కొండల వైపు.. ఆకాశం వైపు వెళ్లిపోయినట్టు
అతను కుర్చీ ఖాళీ చేసి వెళ్లిపోయాడు.

ఎప్పటికీ ఇంకిపోదనుకున్న ఇంకు హఠాత్తుగా ఇంకిపోయింది
సరదాకు చిరునామా జాడలేని లోకాలకు వెళ్లిపోయింది
73ఏళ్ల పాటు మిగిలి ఉన్న జీవితాన్ని వదిలేసి
ఒక చిరునవ్వు హఠాత్తుగా చచ్చిపోయింది

తొందరలు.. తొక్కిసలాటలు... మితిమీరిపోవటాలు
పత్రికల నిండా.. టీవీల నిండా ఎన్నెన్ని
ఆత్మాహుతులు.. రక్త ప్రవాహాలు.. క్రౌర్యాలు..
ఎన్ని చూడలేదు.. ఎన్ని రాయలేదు..
నీ దాకా వచ్చేసరికి చిన్న పిచ్చి హేతువు చాలిందా ప్రాణం తీసుకోవటానికి

పైకి కనిపించకుండా లోలోపల తొలచి తొలచివేసే
బడబాగ్ని వంటి అనుభవం నీకు మాత్రమే తెలుసు
దినం గడుస్తున్న కొద్దీ పలుచబడకుండా గాఢమయిన
ఆవేదన నీకు మాత్రమే తెలుసు
అంచనాలు తలక్రిందులయినాయి

ఆ క్షణంలో ఏం జరిగింది
నిన్ను నువ్వు తిరస్కరించుకోలేని ఆదేశం నీవే ఇచ్చేసుకున్నావు
నువ్వు నిర్మించుకున్న కలల పరిధులను చేరుకోకముందే అచంచలంగా నిశ్చయించుకున్నావ్
మృత్యువు గుహలోకి నిన్ను నువ్వే తోసేసుకున్నావు
ఎందుకింత తొందర?

ఎంత ఒత్తిడి.. ఎంత వ్యధ..
ఎంత నిరాశ? ఎంత తొక్కిడి..
ఇంతమందిమి ఉన్నాం..
ఎవరమూ వెనక్కి లాగలేకపోయాం
కళ్ల ముందే ఉదయాస్తమయాలు యథావిధిగా వెళ్లిపోతున్నాయి
నీవు వదిలి వెళ్లిన ఆ క్షణం మాత్రం చిత్తంలో పదిలంగా ఉండిపోయింది

ప్రియ మిత్రమా మమ్మల్ని సగం కత్తిరించేశావు
మిగిలిన సగంలో ఏదో గుర్తించరాని లోపం
నడకలో... నడతలో మమ్మల్ని ఆవహేళన చేస్తోంది
క్షణిక భావ వలయాల్లో చిక్కుకుపోయి
జీవితాన్ని సరళ రేఖగా మలచుకోలేకపోయావు
ఎప్పటికప్పుడు ముడి మీద ముడి వేసుకుంటూ
కొంచెం కొంచెంగా బిగించుకుంటూ పోయావు

అందిందంతా అఇష్టమైన చోట పంచుతూ
అయిష్టమైన చీకట్లోనే సంతృప్తిని వెతుక్కున్నావు
నీ వారి ఇష్టాల హోరులో నీ అయిష్టం కలగలిసిపోయింది
ఎదుగుతున్న కొద్దీ ముక్కలుగా తరిగిపోతూ
నువ్వు నడిపిన జీవితం ఒక సమరం
ఇందులో ఓటమి లేదు.. గెలుపు లేదు.


- Kovela Santosh Kumar