Sunday, May 15, 2011
ఎంత వెతికినా కనిపించనంతదురానికి ప్రయానానికి సిద్దం అవుతున్నా
నీ అద్బుత మైన ప్రేమాభిమానాలు లేక ఎడారైంది నా గుండె,
నీ ఎడబాటుతో మోడుగా మారింది నాజీవితం..బ్రతుకంటే విరక్తి పుడుతోంది
నా కంటి నుండి నీ కోసం ఎన్నో కన్నీటి చుక్క నేల రాలుతున్నాయి
అప్పుడు గాని తెలియలేదు నీ ప్రేమ సముద్రం నా గుండెలొ వున్నదని,
నీకోసం జారుతున్న ఒక్కొక్క కన్నీటి బొట్టు నన్ను ప్రశ్నిస్తున్నాయి,
ఎప్పుడు నిన్ను నేను కలుస్తానని, ఎప్పుడు ఈ ప్రవాహన్ని నీ ప్రేమతో ఆనకట్ట వేస్తావని.
మౌనాన్ని వాటికి సమాధానంగా తెలియజేసాను,
ఎక్కడని వెతకాలి ప్రియతమా నీ జాడకోసం,
నిన్ను నాగుండెలొ దాచుకున్నాననుకున్నాను,
కాని నా గుండెనే చీల్చి నువ్వెళ్ళిపొయావని తెలుసుకోలేకపొయాను,
నాగుండెను చీల్చడానికి నీకు ఎలా మనసొప్పింది ప్రియా..
ఒకప్పుడు చిన్న మాట అంటే భాదపడేనీవు గుండెలవిసేలానీకోసం విలపిస్తున్నా అని తెల్సి..
మౌనంగా ఏమిజరుగనట్టున్న నీన్ను చూస్తుంటే నామీద నాకు అసహ్యం వేస్తుంది..
నాప్రేమను నీకు పంచలేకపోయానా నా లోపల ఉన్న ప్రేమని నీకు తెలుపడంలో విఫలం అయ్యాను..
నేను ఏమైనా పర్వాలేదు .. నీవెక్కడున్నా సంతోషంగా వుండాలి అన్నదే నేనిప్పుడు కోరుకునేది..
ఇప్పుడు నన్ను చూడాలని నీకు అనిపించడంలేదు కదూ...రేపు నీవు చూడాలనుకున్నా నేనుండక పోవచ్చు
ఎంత వెతికినా కనిపించనంతదురానికి ప్రయానానికి సిద్దం అవుతున్నా
అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి కనీసం నాకు వీడ్కోలు అయినా చెప్పవా ప్రియా..
నీ వీడ్కోలు కోసం ఎదురు చూస్తున్నా..ప్లీజ్ కనికరించవా..?
Labels:
కవితలు