Sunday, May 22, 2011
ఎదన దుఃఖం ఎగసి పడుతున్నది..
ఎదన దుఃఖం ఎగసి పడుతున్నది
నీ తలపులతో తనువుబరువు అవుతున్నది
హృదయపు సవ్వడులు తక్కువై నిట్టూర్పులు ఎక్కువ అవుతున్నాయి
నా ప్రేమ ఓటమిని అంగీకరించ నంటున్నది
నీవు లేని జీవితం వ్య్రర్దంఅని ..మరణం నన్ను ఆహ్వానిస్తుంది
నీ సంతోషం నీవు చూసుకోని నాను మరణమే శరణ్యిం చేస్తున్నావు
మరణం విజయ దరహాసం చేస్తున్నది..నీకు నేనే దిక్కు అంటూ
పెదవి దాటని పదాలు నిన్ను కడసారి చూడాలంటున్నవి!
అదే చివరి చూపని కూడా చెబుతున్నా..
ఎందుకిలా నన్ను మోసం చేశవని అడుగలేను..
అసలు నాజీవితంలో ఎందుకు ప్రవేశించావు ..ఎందుకు వెళ్ళిఫోయావు..
ప్రతిక్షనం నన్నెందుకు చిత్రవధకు గురి చేస్తున్నావు....
నీ సంతోషం చూసుకున్నావు కాని నా భాదగురించి ఒక్కసారైనా ఆలోచించావా..
వద్దులే నీవు ఎక్కడున్న సంతోషంగా ఉండు నేను ఎమైతే నీకెందుకు..
స్వప్నం కూడా నిన్ను కానలేదన్నది
నా జీవితం మైనంలా కరుగుతున్నది
నిరాశల నిశిరాత్రిలో ఆశలు మినుకుపురుగులై మెరుస్తున్నవి
Labels:
కవితలు