Sunday, May 15, 2011
మనసుపొరల్లో వేదన నీకెలా తెలిపేది....?
మనసుపొరల్లో వేదన నీకెలా తెలిపేది ..
గోంతులో ఆగిపోయిన భావాలు ..ఎన్నో మాట్లాడాలని ఉంది..
నామనసుపొతల్లో దాగిన ఎన్నో రహస్యాలు నీకు చెప్పాలని ఉంది..
ప్రతిక్షనం నీవు గుర్తుకు వస్తున్నావు...నాలో అలజడి సృష్టిస్తున్నావు..
ఒకప్పుడు ఎంతో దైర్యంగా ఉండే నేను నీ విషయంలో
ఇలా ఎందుకవుతున్నానో అర్దకావడంలేదు
నాకెందుకో ఈ మద్యి ఆందోళన పెరిగిపోతుంది
నిన్ను కలవకుడానే నాకేదో అయిపోతుందని..
నిజ్ఞాపకాల పొరలు నన్ను క్షనం కూడా వదలటంలేదు..
నేనున్నాను అంటూ ఒకప్పుడు నీవు చెప్పేదైర్యం ఇప్పుడేది..
నీవంటే నమ్మకం...అని అన్నమాటలు తూటాల్లా నాకు గుర్తుకు వస్తూనే ఉన్నాయి
మాట్లాడక పోతే...నాకు నచ్చదు అన్నావు మరి ఇప్పుడెందుకిలా మారిపోయావ్..
ప్రతిక్షనం గుర్తుకొస్తాను అన్న మాటలు నిజంకావా..మరి ఇప్పుడు గుర్తుకు రావడంలేదా..
మాటల ప్రవాహం ఎందుకు ఆగిపొయింది....నేను ఎంతప్పు చేశాను ఎందుకిలా..
ఉదయాన్నే పలుకరించే నీ పలుకరింపులు ఏవి..ఇప్పుడేమయింది ఎందుకిలా..
మొదటి రోజు నీమీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడూ అంతకంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నా..
నా ప్రాణం కంటే నిన్నే ఎక్కువ ఇష్టపడతాను అని తెల్సు...అయినా ఎందుకిలా మారిపోయావు..
Labels:
కవితలు