Saturday, May 21, 2011
నీ ప్రేమకోసం నేను పడిన వేదన,ఎందుకు నాకు దూరం అయ్యావు
నీ ప్రేమకోసం నేను పడిన వేదన,
నా ప్రేమను నీకు వ్యక్తం చెయ్యాలన్న ఆవేదన,
నీకోసం జారే ప్రతి కన్నీటిబొట్టు చూసినప్పుడు కనిపిస్తుంది,నా మదిలొని నీ ప్రేమ,
నీ కోసం కన్నీళ్ళు పెడుతున్నా ఆనందంగా ఉంటుంది,
దూరమైన నీకోసం చూసే ఎదురుచూపులో ఆనందం వెతుక్కుంటున్నా,
నీవు చెంత ఉంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందం తెల్సా
నీ ప్రేమ పొందాలని పడే ఆరాటం,
నిన్ను చేరువవ్వాలన్న ఆకంక్షా,
నీతో సమయాన్ని గడపాలన్న ఆలోచనలు,
నీ ప్రేమ దొరకముందు నాకివన్నీ తెలిదు,
అసలు ప్రేమలో కాదు ఎదురుచూడటంలోనే ఆనందముంది,
ప్రేమ దోరకముందు ప్రేమ కనిపిస్తుంది,
కాని ప్రేమ దొరికిన తర్వాతా ప్రేమ మాయమవుతుంది,
నాకు తెల్సి ఇప్పుడు అదే జరిగింది కదా..ఎందుకు నాకు దూరం అయ్యావు..
అందుకే నాకిక బ్రతకాలని లేదు నీవు దూరం అయ్యావుకదా..
నేను నీకు కనిపించకుండా ఉంటేనే ఇష్టం కదా నీకు అడ్డం లేకుండా పోతా కదా
Labels:
కవితలు