Saturday, May 14, 2011
చందమామ బాగుంది కదాని ..అందుకోవాలనుకోవడం పిచ్చి కదా..?
చందమామ బాగుంది కదాని ..అందుకోవాలనుకోవడం పిచ్చి కదా..?
ఓ రోజు చిన్న నీటి కుంట వద్ద సేదతీరిన సమయం..
అప్పుడప్పుడే కమ్ముకుంటున్న చిరు చీకట్లు..వీస్తున్న చిరుగాలులు..
ఆ వాతావరనం..మనసులు ఉల్లాస పరుస్తున్న సమయం..
ఎందుకో నీటిలో కనిపిస్తున్న చంద్రున్ని చూశా..ఎంత బాగుందో..
నాకోసమే నా పక్కకు వచ్చిందా అనిపిచింది.. నన్ను చూసి నవ్వుతున్నట్టుంది..
ఆ నిండు చంద్రున్ని చూసి ప్రపంచాన్ని మరిచా ..అదే నిజం అనుకున్నా..
ఆ చంద్రుని చూస్తు మైమరిపోతున్నా...కలల్లో విహరిస్తున్నా..
ఎందుకో చంద్రిక నానుంచి దూరం అయినట్టు ఉలిక్కి పడ్డా..
నిజమే చంద్రిక నా పక్కన లేదు..జరిగింది నిజంకాదు..
నిజంలాంటినిజం..
ఊరించి ఊరించి దూరం అయింది..ఎప్పటికి తిరిగి రానంత దూరంగా పొయింది..
అందుకే..చందమామ బాగుంది కదాని ..అందుకోవాలనుకోవడం పిచ్చి కదా..?
Labels:
కవితలు