ఏమని రాయను ?
నీ కోసం ఆలోచిస్తూ కూర్చుంటే ఏమైనా రాయకూడదూ!
అని మనసు తొందర పెడుతుంది.
నువ్వు లేని ఈ క్షణం చాల భారంగా గడుస్తుందని అంటుంటే
నాకు తెల్సు అంటుందీ జరుగుతున్న కాలం...
నీతో గడిపిన ప్రతీ క్షణం నాకో మధురస్వప్నం అని అంటుంటే
నాకు తెల్సు అంటుంది జరిగిపోయిన కాలం...
నువ్వు ఎప్పటకీ నాతోనే వుండాలని శాసించి..
ఉంటావని గర్వంగా అంటుంటే
నాకు తెల్సు అంటుంది జరగబోయే కాలం...
మరి నా ప్రియతమా ఏమి రాయాలి అని అంటుంటే మాత్రం
నాకు తెలియదని తప్పించుకుంటుంది
ఏమని రాయను ? ఇంకేమని చెప్పను ?
నువ్వు నా ప్రాణమని చెప్పనా?
అది నీకు తెలియనిది కాదుగా !
నువ్వు లేని నేను లేనని చెప్పనా ?