నిన్ను చూసిన నా కళ్ళు లోకన్ని చూడటం మానేశాయి
నిన్ను తప్ప ఎవ్వరినీ చూడనంటున్నాయి..
నీవే కావాలంటూ మారాం చేస్తున్నాయి..
నీ అందం అనే సంకెళ్ళతొ వాటిని బంధించేశావు
నీ మాటలతో నన్ను మాయచేసి మురిపించావు
నిన్ను ప్రేమించిన నా మనసు ఇంక ఎవ్వరిని ప్రేమించనంటుంది
నీ ప్రేమతొ నా మనసు అంతగా ఆకర్షించావు
కాని నువ్వు నిన్ను కాదని తనని ప్రేమించమంటున్నావు
ఎలా నా మనసు తనని ప్రేమిస్తుంది
ఎలా నా గుండె నీకోసం కొట్టుకుంటుందో తెలుసా
నాకు ప్రేమని పంచటం తెలియదు నిన్ను ప్రేమించటమే తెలుసు ..