Wednesday, May 4, 2011
మనసుని ముక్కలు చేసే ఈ మౌనాన్ని నేభరించలేకపోతున్నాను
చంపేసెయ్యి నా మనసుని నా ఆలోచనల్ని చంపేసి
నిన్ను నువ్వు తీసుకెళ్ళిపో నిన్ను నువ్వు తీసుకెళ్ళిపోయావు
నాలో నరనరానా నిండిపోయిన నిన్ను నువ్వు తీసుకెళ్ళిపోయావు
మనసుని ముక్కలు చేసే ఈ మౌనాన్ని నేభరించలేకపోతున్నాను
ఈ మనోవేదనని తట్టుకునే శక్తి నాకు ఉండటం లేదు
నీ కోసం కార్చిన కన్నీరు కూడా నన్ను గేలి చేస్తుంటే
సమాధానం చెప్పలేక నన్ను కూడా చంపేయమని ఆడగాలని ఉంది కాని
నా ఆలోచనల్లో నా ఊహల్లో తనువంతా ఉన్న నిన్ను దాటి
ఏ మృత్యువు నను దరిచేరలేదు ఎందుకాని ఎదురుచూస్తున్నా
అప్పుడు నాలో నువ్వులేని నేను ఉన్నా చచ్చిపోయినట్లే ప్రాణం ఉన్న జీవశ్చవాన్నే..
అయినా సరే నాకీప్రాణం వద్దు నీవులేని నేను లేను..నాకు బ్రతకాలాని లేదు..
ఒకప్పుడు నాకు ఇలాంటి ఆలోచన వచ్చిందంటే ఆందోళన పడేదానిపి కాని ఇప్పుడు..
మౌనంగా ఉంటున్నావంటే ... నా చావుకోసం నీవు ఎదురు చూస్తున్నావుకదా.. ప్రియా
Labels:
కవితలు