Monday, May 2, 2011
ఓడిన నా ప్రేమని ఏమని అడిగేను?
ఓడిన నా ప్రేమని ఏమని అడిగేరు?
దారి మరచి నడకే సాగక ఎట్టువెల్లాలో తెలియక
నిన్ను చేరలేక నీ రూపు చూడలేక
నా మనస్సే శిధిలమై మలినమవుతోంది
మాటే మరచి మనస్సే మూగదై ఏమీ చెప్పలేక
నిన్ను వీడలేక నీ దరి చేరలేక
కన్నీరే ప్రవాహమై పరుగులు తీస్తోంది
నా మనస్సు తెరలో దాచిన భావాలను నీకు చెప్పలేక
నా కన్నుల కాంతిలో అవి నీకు చూపలేక
మనస్సే మూగబోతోంది .....
నీవు కనిపించగానే ఏదో చెప్పాలనే ఆలోచన
మనస్సున్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది
నువ్వు కనిపించినా ఏమీ చెప్పలేని పెదవి మాత్రం
నా మనస్సుని అణచివేస్తోంది
ఒక్క స్వప్నం నిన్ను నాకు దగ్గర చేయాలనే ప్రయత్నం
ఒక్క మౌనం వీడిన పెదవిని అందుకోవాలనే తాపత్రయం
గాల్లిలో దీపాన్ని గుండెల్లో ప్రాణాన్ని ఎవరని దాచేరు
ఏన్నాలని ఉంచేను ఓడిన ప్రేమని ఏమని అడిగేను?
Labels:
కవితలు