Monday, May 2, 2011
నువ్వూ నేనూ లేని జీవితం..
ప్రియతమా!
ఏమని పిలువను...
మనసు నీ ఆలోచనలతో అలజడితో ఊగుతున్నప్పుడు..
నమ్మిన విశ్వాసం ఆ విశ్వాసం సాక్షిగా చెదురుతున్నప్పుడు..
నేనున్నానంటూ పలకరించావు
నీకు నువ్వు నాకు నేను అంటూ
ప్రపంచం సాక్షిగా..మన మనస్సుల సాక్షిగా
మనం నడకను కొనసాగిద్దామంటూ...నేనడిగితే
నువ్వొచ్చావు.నాలో ఆశలు రేకెత్తించావు
ఆశాజీవనలతలను మోసుకుంటూ నువ్వొచ్చావు..
సెలయేటి పాటలా నువ్వొచ్చావు..మనసు పులకించేలా
నువ్వూ నేనూ లేని జీవితం..
నీకూ నాకూ లేని జీవితం..
జీవితం కాదంటూ
నువ్వొచ్చావు...
సువిశాల జగతిలో మనిషికి ఎంత చోటు కావాలంటూ...
ఎందుకు జీవించలేమంటూ...నిన్ను ప్రశ్నిస్తున్నా..?
సమాదనం చెప్పేస్థితి ఎందుకు దాటిపోయావు
ప్రియతమా....
ఏమని పిలువను?
నిన్ను ఏమని పిలవను?
ఎలా పిలవను అర్హత ఉదాలేదాంటూ నన్ను నేనుప్రశ్నించుకుంటున్నా..
Labels:
కవితలు