మిస్సింగ్ ఓ ప్రయత్నంలా మొదలై ప్రభంజనమైంది. 41ఎపిసోడ్లు 38 సక్సెస్ లు ఇదీ మిస్సింగ్ జైత్రయాత్ర..ఇంటి నుంచి వెళ్లిపోతున్న, తప్పిపోతున్న చిన్నారులకు సంబంధించి ఆయా కుటుంబాలు పడ్తున్న ఆవేదనను మిస్సింగ్ కథనాల ద్వారా ప్రజల ముందుంచింది సివిఆర్ న్యూస్. ఒకటి కాదు రెండు కాదు వందకు పైగా కుటుంబాల గుండెకోతను మిస్సింగ్ కథనాల ద్వారా ప్రసారం చేసింది సివిఆర్ న్యూస్..ఇప్పటి వరకు ప్రసారం చేసిన 40మిస్సింగ్ కథనాల ద్వారా 36మంది చిన్నారులను తల్లిఒడికి చేర్చింది సివిఆర్ న్యూస్ క్రైం బ్యూరో.
శవ్యాప్తంగా గత మూడేళ్లలో రెండులక్షల 36వేల 800మంది పిల్లలు అదృశ్యమైతే అందులో కేవలం లక్షా 61వేల 800మంది చిన్నారులు మాత్రం దొరికారు. ఇంకా 75వేల మంది చిన్నారుల జాడ తెలియలేదంటే పిల్లల అదృశ్యాలకు సంబంధించిన కేసుల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.మిస్సింగ్ కేసుల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో స్పష్టమవుతోంది. ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారిన నేపధ్యంలో పాప, లేదా బాబు తప్పిపోయారంటే ఆ ప్రభావం ఆయా కుటుంబాలను ఏళ్లతరబడి వెంటాడుతుంటుంది. ప్రతి ఏటా వేలాది మంది పిల్లలు అదృశ్యమవుతున్నారంటే ప్రభుత్వాలు ఈ విషయాన్ని మరింత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.అందుకే సివిఆర్ న్యూస్ ఆ భాద్యతను తనదిగా చేసుకోని ముందుకెలుతోంది