. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, June 4, 2013

గుండె చప్పుళ్ళ శబ్దాలు నీకు వినిపించలేని నిశ్శబ్దపు మౌనరాగాలు-2

1) ఈ కళ్ళలో దాచిన ముళ్ళ పూలనేరుకుంటూ..మనసు కొలనులో ఇమడని జ్ఞాపకాలను తలస్తూ

2) మనం అని చెప్పుకునేందుకు మనమద్యి మిగిలింది ఆ జ్ఞాపకాలే ...
మదిలోని భావాలు నిన్ను తడిమినప్పుడల్లా తడికళ్ళను తుడిచేందుకు నీ జ్ఞాపకాలే మిగిలాయి


3) చెప్పుకున్న మాటలకు అర్ధాలు చెరిగాయి..అపార్దాలు మన మద్యి మౌనంగా చేరాయి

4) మగతగా మదిని తొలుస్తున్న నీజ్ఞాపకాలు... నిద్రచాలనే తపనే తప్ప
కళ్ళు తెరిచినా మూసినా నీవే ఉంటే ఎలా నిద్రపోను నా భాదను ఎవరికి చెప్పుకోను

 
5) మౌనాన్ని బద్దలు కొట్టి ఊసులు ఊహల్లో తేలియాడుతున్నా ఏమౌతుందో ....?

6) చేరువవుతున్నాననే తొందరలో ఏకాంతపు చిరుగులను చూసుకోలేదు..అర్దం చేసుకుంటుందిలే అని

7) నీ వెన్నెల ఒడిలో సేద తీరాలని ఉంది..ఆ చల్లని వెలుగులో ప్రపంచాన్ని శోధించాలని ఉంది

8 ) మౌనమే నీ బాష అయినపుడు నీ ఉనికిలో ఒదిగిపోతా నీ ఊహల్లో కరిగిపోతా

9) కన్నీటి మేఘాలు ఎప్పుడు కరుగుతాయో..ఎప్పుడు కలవరపెడతాయో..ఎప్పుడు మురిపిస్తాయో

10) బీటలు వారి నెర్రెలిచ్చిన నా మనసు మీద నీ కన్నీళ్ళు ముత్యపు చినుకులై మెరుస్తున్నాయిలే

11) రెండు గుండెల మధ్య చెలరేగిన భావాల దొంతరల దూరం పెరిగితే దారి తప్పిన మనసుల గతి అంతే

12) నవ్వులు కరువైన చోట అనుభవం వెతుక్కోవటం అంటే గాలిలో దీపాన్ని వెలిగించటమే

13) ఒంటరితనం కమ్ముకున్నప్పుడు గుండె పచ్చి పుండుగా మారుతుంది
హృదయాన్ని నువ్వు తీరని గాయం చేసి వెళ్ళిపోయినప్పుడు ఎవరికి చెప్పుకోను


14) ఆ పెదవుల తోటల పూసే వరమే ఉంటే కథగానే మారిపోనా..కావ్యంగా కరిగిపోనా

15) ఏం జరిగిందో మరి ఆ కళ్ళు కరిగాయి..మనసులోకి చేరిన నీ జ్ఞాపకాల అలజడికి 

16) టపా టపా కన్నీరు చెక్కిళ్ళపైనా గుండెలపైనా
జన జనా వాన టప టపా కన్నీటి వాన..అయినా నీ మనస్సు కరిగేనా


17) ఏకాంత వనంలో ఎదలో ఏదో రాగం వినిపిస్తూ ఉంటుంది..చుట్టూ చూస్తే నిశ్శబ్దం ఏంటో ఈ మాయ

18) నింగిలో దూరంగా అలుముకున్న చీకటిని తదేకంగా చూస్తూ ఉన్నాను
నీ మనసు పొరలు అడ్డున్నాయేమో.. కన్నీటి తెరలు అడ్డొస్తున్నాయేమో అందుకేనేమో ఈ చీకటి


19) గుండెను పెకిలించి పెల్లుబికే ప్రశ్నలు నీ సమాధానాల్లో జీవించమన్నాయి..

20) మౌనంగా ఉన్న నాకు ఏదో తెలియని శక్తి నన్ను బుజ్జగించి నీ జ్ఞాపకాల్లొకి నెట్టేస్తుంది