మన ఇద్దరి మధ్యా ఇంతటి దూరం అవసరమా?
మన మనసులు మాట్లాడుకోవా?
ఎవరో నిర్మించిన చట్రాలలో ఇమిడి
మరెవరో కలిగించిన కష్టాలను తడిమి
పదాలను వెదికి పెదాల వెనుక దాచి
పలకరించాలని వున్నా వేరెటో చూసి
మది గదిలో బందీగా నేను మళ్ళీ
ఇంతటి సమూహంలో ఎప్పటిలాగే ఒంటరిని
ఓంటర్ని చేసింది నీవు
కంటనీరు పెట్టించింది నీవు
కనుమరుగైపోయింది నీవు
మరి ఇన్నిటికీ నన్నే దోషినెందుకు చేస్తున్నావు
మన మనసులు మాట్లాడుకోవా?
ఎవరో నిర్మించిన చట్రాలలో ఇమిడి
మరెవరో కలిగించిన కష్టాలను తడిమి
పదాలను వెదికి పెదాల వెనుక దాచి
పలకరించాలని వున్నా వేరెటో చూసి
మది గదిలో బందీగా నేను మళ్ళీ
ఇంతటి సమూహంలో ఎప్పటిలాగే ఒంటరిని
ఓంటర్ని చేసింది నీవు
కంటనీరు పెట్టించింది నీవు
కనుమరుగైపోయింది నీవు
మరి ఇన్నిటికీ నన్నే దోషినెందుకు చేస్తున్నావు