1) కనురెప్పల కొసల దాగున్న కన్నీటి సాక్షిగా
నడి రాతిరి నిదుర కాస్తా చెదిరిపోయింది..మరో రోజు మదికలవరింత మొదలైంది
2) రాత్రి నా కోసం చల్లని వెన్నెలను జాలువాల్చిన ఆకాశమా పొద్దు పొడవగానే ఎందుకు కన్నెర్రచేస్తున్నావో కాస్త చెప్పవూ
3) నవ్వు లేని నా గుండెలో నాకైనా చోటులేదు . .
నవ్వు లేని నా కనులలో కలకైనా తావులేదు నా "ప్రియ" మిత్రమా
4) పగలును కర్కసంగా పగలగొట్టి ఆ ముక్కలను నల్లటి దుప్పటితో కప్పి "చీకటి" తనని తాను రాజు గా ప్రకటించుకొని వెలుగనేది కానరానీయకుండా చేసింది
5) ప్రేమంటే నువ్వున్నప్పుడు నన్ను నేను
నువ్వులేనప్పుడు ఈ లోకంలో నేనున్నా అని మరిచిపోవడం
6) క్షణాలన్నీ నాకేసి జాలిగా చూస్తున్నాయి
కరుడుగట్టిన కాలం చేసిన గుండెగాయానికి మందు నీ తియ్యని మాటలే
7) ఆకాశం మీద ఎవరెవరో వచ్చి నలుపు చీరలు ఆరేశారు.. సరిగ్గా పిండలేదేమో నీటి తుంపరలు పడుతున్నాయి.
8) నా స్వప్న సౌధపు పునాదులను ఎవరో పెకిలిస్తున్న భావన అన్నీ నిజాలౌతున్నాయో అన్నీ అబద్దాలో అర్దం కావడం లేదు గజిబిజి గందరగోళం లో
9) నీవు నన్ను విడిచి వెళ్ళినా గాని నీ స్వప్నాలుబలమైనవని నీజ్ఞాపకాలు పదునైనవని గుండెల్లో గుచుకున్న ప్రతిసారినిన్ను గుర్తు చేస్తున్నాయి
10) కాలం కౌగిట్లో క్షణాలు కరిగిపోతుంటే
రాతిరి విడిపోయి వేకువలోకి జారి కొత్త ఆశల కోసం వెతుకులాట ప్రారంబం
11) నీ జ్ఞాపకాల తోటలో ఉదయించే సూర్యుడి నయ్యా
తలపులను అల్లుకుపోతున్న నీ మాయలో కొట్టుకపోయేందుకు మరో రోజు సిద్దం అయింది
12) కలయికలూ కన్నీటి వీడ్కోల నడుమ
కాలాన్ని కావ్యంగా మలచినా ఎందుకో మనసు కుదుట పడటం లేదు
13) కలల దుప్పటి కప్పుకుని
కరిగిపోని వాస్తవాలను తలచుకొంటు కలత నిద్రలో నేను
14) నీవు మూసేసిన నీ మనసు తలుపుల ముందు,
నన్ను లోపలికి రానియ్యవా అని వేడుకొంటూ దిగులుతో నిల్చున్న క్షణం గుర్తు చేసుకున్నాను
15) నిన్నటి జ్ఞాపకాలు విదిలించుకుని.. రేపటి గూర్చిన ఆశలు మొదలు పెట్టినా.నీ జ్ఞాపకాలు కందిరీగల్లా కుడుతూనే ఉన్నాయి నా హృదయాన్ని చిల్లులు పెడుతూనే ఉన్నాయి
16) పగలంతా నువ్వు లేని క్షణాలని గడపి మర్చిపోనివ్వని జ్ఞాపకాల్ని భరించి కన్నీళ్ళను గుండెల్లో దాచి నవ్వులు పులుముకు తిరిగాను నిజాన్ని అబద్దంలో దాచేసి
17) మబ్బులు కమ్ముకొచ్చిన వేళ కూడ,
చినుకుల్లో చిరుసందేశాన్ని పంపావేమో అనిపిస్తుంది నిజమా...?
18) మనసుకి స్నేహం మత్తు నిచ్చి నిద్రపుచ్చుతూ
మాటలకు మౌనం భాషనేర్పి మదిలో వేదనపడుతూ ఇంకా ఎంతకాలమిలా
19) మాటల గువ్వలను ఎగరనీయకుండా
భావాల రూపం లోగుండె లోనే బందించేస్తూఇంకా ఎంత కాలమిలా..
20) కళ్ళలో దాగిన చిన్న కన్నీటి బొట్టు జారిగుండె లోని ఎంత భారాన్ని దించింది...
21) చిరునవ్వొకటి చిందిస్తావా... చెప్పు మృత్యువునైనా ఆహ్వానిస్తా
22) ఏంటో నిశ్చబ్దశబ్ద ప్రకంపనాల మధ్య..ఎందుకో నాకళ్లు చెమ్మగిల్లుతున్నాయి అర్దం కావడం లేదు
23 ) ఈ రేయి నాకు కునుకు లేదు.అప్పుడప్పుడూ ఆకాశం లో జాబిల్లి కై చూస్తూ చీకటిన నీకై వేచి చూస్తున్నాను
24 ) ఎదలో ఏవో వ్యధలే ఉన్నా పెదవి చిందే "లాస్యి " నవ్వులవాన లో నేను తడచి ముద్దాయ్యేనా
25) బీటలు వారిన హృదయం మీద నెర్రెలిచ్చిన
మనసు మీద నా కళ్ళు ముత్యపు చినుకులై వాలి పోతున్నాయి