. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, June 17, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(3)

1) నీ జ్ఞాపకాలన్నిటినీ తడుముకుంటుంటే 
ముల్లుల్లా గుచ్చుకుంటున్నాయేంటి ప్రియా
 

2) కుప్పలు పోసి నాలా మాంసపు ముద్ద లైన మనుషులే.
నీవేకాదు నీలాంటి వాళ్ళూ ఇంకా చాలా మందే ఉన్నారు ప్రియా
 

3) ఆమె కాళ్ళక్రిందకు నా స్వప్నాలు చేరుకుంటున్నాయి..
భరించలేని భాదతో మెల్లగా తొక్కిపట్టమని ప్రాధేయపడుతున్నాయి


4) ఒక్కక్షణం కూడ నను వీడని నీ జ్ఞాపకాలు
మరుక్షణంలోనే మాయమవుతాయని ఎలా ఊహించావు ప్రియా


5) ఒకేసారి పలకరించే పోయే అనురాగం ..ఒకే క్షణంలో పోయే ప్రాణం తో సమానం ప్రియా  


6) నువ్వు దోచుకెళ్ళిన నా మనసు గోడల మధ్య నీ భావాలను బంధించ లేను నీ కోసమే కోటి ఆశలతో ఎదురు చూసే నా కనులలో కన్నీరు చిందించకుండా ఆపలేను


7) నా జ్ఞాపకాల తెరలను చీల్చుతున్నాయి
అడుగడుగున ప్రతి కదలికలో అనంతమైన నీ ఆలోచనలు నన్ను వేదిస్తునే ఉన్నాయి


8) నాలో నేను ఈ నిశ్శబ్దపు యుద్ధం చేయ్యలేక
చెదిరిన స్వప్నాలను కన్నీటి బాష్పాలుగా మారుస్తూ ఎదబీడుని తడుపుతున్నాను


9) క్షణాల నీడల్ని దాటి రావాలనే ఆతృతలో కనబడుతోంది భావావేశాలను కొల్పోతూ... ఉద్విగ్నతకు గురవుతూ


10) నీ మౌనంలో నన్ను నేను వెతుక్కొన్నా..

చీకట్లో దారితెలియనట్టు నాకు నేనుగా నాలో లేని నన్ను వెతుక్కుంటూ  


11) మరచిపోదామనుకున్నవేళ జ్ఞాపకంలోనూ నీవే
వద్దని వెళ్లిపోతుంటే నీడవై వెంటాడేదీ నీవే వేదించేది నీవే


12) కాలమిలా నీరూపంలో నా జీవితంలో విషం చిమ్మింది నీవు పంపినవీడ్కోలులో విషాదం ఉప్పెనలో మునిగిపోయేలా చేసింది


13) ప్రాణం పోవడం అంటే ఇప్పుడు తెలుస్తుంది
కనిపించినట్టే కనిపించి నన్ను లెక్కచేయకుండా నీవు వెళ్ళిపోతుంటే తెలిసొచ్చింది


14) ఓ గుప్పెడు అక్షరాలు జేబులో వేసుకుని నీకోసం
ఎదో రాసేద్దాం అనుకుంటా కాని నీవు చేసిన ఆవమానాలు గుర్తుకొచ్చి మౌనంగా ఉండిపోతా


15) మన మనసులోపల దాగిఉన్న ప్రేమ
మనిద్దరి మనసుల పై రక్తపు మరకలు గా మిగిలిపోయా ఎందుకో


16) నన్నేవరో చంపేశారు..ముక్కలు ముక్కలుగా నరికారు కాని నీకూ నాకు మద్యి ఉన్న ప్రేమను ఏం చేయలేకపోయారు ప్రియా


17) అసలు నాపేరేంటీ.. ఎప్పుడూ నీ నామాన్ని తలస్తూ
నీ పేరుకి అలవాటుపడ్డ నేను...ఎవరో నాపేరు అడుగుతున్నారు కాస్త చెప్పవూ


18) కలంతో రాయాలని చూస్తున్నా..కరిగిపోయిన గతాన్ని తలచుకొని అక్షరాల బదులు కన్నీచుక్కలు కనిపిస్తున్నాయి అవి నీవా ..నావా.. ప్రియా .?


19) జ్ఞాపకాలను ముక్కలు గా కోస్తున్నా
ఎక్కడన్నా మళ్ళీ మన ఆనందాలు ఆనవాళ్ళు దొరుకుతాయేమో అని


20) నా చీకటి ప్రపంచంలొ నీడలా ఉన్ననీవు
వెలుగైవచ్చావు...ఎందుకో నన్ను నిలువువా దహించివేస్తున్నావు


21) మేఘంకరిగి చినుకుగా మారి నేలను తాకినట్లు
అనుభవాలు కరిగి మధురక్షణాలై నిన్ను తడిమి తడిపేయాలను ఉవ్విల్లూరుతోంది మనస్సు


22) తలపు జల్లుల్లో తడిసేలోపే ఆశల గాలికి గుండెలెండి పోతున్నాయి మెరిసిన జ్ఞాపకం ..ఉరిమిన గొంతు, ఎదను కోస్తున్న నీ అవమానాలు,కురిసిన కళ్ళు


23) పెనవేసుకున్న చూపులు చెయ్యగలిగిందేమీ లేకనే ఏమో చేసేదేం లేక చటుక్కున కన్నీళ్ళలో ఎందుకో కరిగిపోయాయి..


24) ఎందుకో చిమ్మచీకటి రేతిరి గాలుల్లొ నెమ్మదిగ ఒదిగిన క్షణాలు తరగని దూరాలతో బరువుగా నిట్టూర్పులు విదుల్చుతున్నాయి నాకు


25) ఎదలోతులోకి ఎగబాకిన నల్లటి చీకటి
ఇక రాకు అంటూ నన్ను వెనక్కి నెట్టివేస్తుంది వెన్నెల లేని....?


26) నా ప్రేమలో స్వార్దాన్ని చూపావు..నా తపనలో తప్పులు వెదికావు నా మనసుని మట్టిగా తేల్చావు..నా నీ కై తపిస్తున్న నా అత్మను పంజరమనుకున్నావు ఎందుకో


27) భగ్గుమంటున్న ఒంటరితనపు సెగలు నన్ను కాల్చి తగలెట్టక ముందే నీ జ్ఞాపకాల్లో నలిగిపోనీ తెలియని లోతులలోకి కరిగిపోనీ అలసి పైలోకాలకు ఆవిరైపోనీ ప్రియా


28) కమ్మిన మబ్బు గుండెలో వాన చినుకులు..
కంటి నిండా దాచలేని ఈ కన్నీటి చుక్కలు దాచాలన్నా దాగటంలేదు


29) నిశ్శబ్దంగా నన్ను చేరుకుంటావు వర్తమానపు ఒంపుల మీదుగా 

ఏ గతపు లోయల్లోకో జారిపోకుండా...ప్రస్తుతాన్ని గతంలో దాచేవెందుకు..?


30) గమ్యం తెలీని నా జీవన ప్రయాణానికీ 

ఆశలు నింపి అడ్రలేకుండా వెళ్ళావెందుకు ప్రియా


31) ఎప్పుడు కరుగుతాయో ఎప్పుడు కలవరపెడతాయో..ఎప్పుడు కురుస్తాయో తెలీదు ఎప్పుడు మురిపిస్తాయో అంతే చిక్కవు మనసులేని ఆ నల్లని మేఘాలు


32) జ్ఞాపకాలు కరిగి కదిలిస్తాయి..

వేదనలు కదిలి కరిగిస్తాయి   


33) ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తునో..

ఏ రాగం ఏ గుండె లోతున ఏ గీతం పలికించునో...? 


34) చికటి పొరలో చిక్కుబడి పోయానిప్పుడు..

దారి చూపేందుకు ఒక వెన్నెల స్నేహం కావాలి.     


35) చల్లని మంచు వెన్నెల కౌగిట్లో తెర చాటున వున్న జాబిల్లి శ్వాస చిరుగాలి తాకిడిలో వెచ్చదనం నింపి మనసంతా నీజ్ఞాపకాలతో నిద్రపట్టేదెలా ప్రియా


36) నాతో ఎవరో వున్నారనిపిస్తోంది మనం చెప్పుకున్న బాసలు వినిపిస్తున్నాయి జాబిలి గుండెలో నేను ఉన్నట్టు..?..అది బ్రమా నీమా తెల్సుకోలేకున్నా ప్రియా


37) టపా టపా కన్నీరు చెక్కిళ్ళపైనా ..

జన జనా వాన టప టపా కన్నీటి వాన   


38) గుండెను పెకిలించి పెల్లుబికే ప్రశ్నలు నీ సమాధానాల్లో మిగిలాయి అందుకేనేమో ప్రశ్న..సమాదానంగా మిగిలి శిదిలం అయిందేమో ప్రియా


39) మనసులోకి చేరిన నీ జ్ఞాపకాల అలజడికి ఏం జరిగిందో ఆ కళ్ళు కరిగాయి కన్నీళ్ళుగా మారి చిరుజల్లులై ఈరోజంతా కురుస్తూనే వున్నాయి ప్రియా


40) నీ వెన్నెల ఒడిలో సేద తీరాలని ఉంది..

ఆ చల్లని వెలుగులో ప్రపంచాన్ని శోధించాలని ఉంది