ఒక నమ్మకాన్ని నిర్మించలేని
నిలువెత్తు అపనమ్మకానివి
నా శరీరాన్ని నా హృదయాన్ని
నా ఉనికిని ఛిద్రం చేయటానికి
యుగ యుగాల క్షణాలన్నీ
నీ అసందర్భానికి సమయానుకూలాలు
నా క్షమలోనే నీ క్షేమం నీకూ నాకూ మధ్య
నీ దేహ భాషకు మనసు భాషకు
నా హృదయ శ్వాసకు మధ్య ఎప్పుడూ ఊపిరాడదు
నువ్వు రగిలించిన మమతల
యుద్ధ వాతావరణంలో ఓడిన సైనికున్ని చేసావు
ఎదురు దాడి ప్రారంభించి తుది తీర్పుని
అరుపుతో ప్రకటిస్తావు నేనెన్నో దుఃఖజ్వాలల్లో
కాలిపోతూ మౌనంతో కరచాలనం చేస్తాను.
తప్పని పరిష్తితుల్లో తప్పించుకోలేక
తన్నుకొస్తున్న దుక్కాన్ని ఆపుకోలేక
ఆగని కన్నీళ్ళకు దారి చూపలేక
తపన పడుతున్న మనసుని
మనసు పడుతున్న వేదన తెల్సుకోలేవులే ఏప్పటికీ
నిలువెత్తు అపనమ్మకానివి
నా శరీరాన్ని నా హృదయాన్ని
నా ఉనికిని ఛిద్రం చేయటానికి
యుగ యుగాల క్షణాలన్నీ
నీ అసందర్భానికి సమయానుకూలాలు
నా క్షమలోనే నీ క్షేమం నీకూ నాకూ మధ్య
నీ దేహ భాషకు మనసు భాషకు
నా హృదయ శ్వాసకు మధ్య ఎప్పుడూ ఊపిరాడదు
నువ్వు రగిలించిన మమతల
యుద్ధ వాతావరణంలో ఓడిన సైనికున్ని చేసావు
ఎదురు దాడి ప్రారంభించి తుది తీర్పుని
అరుపుతో ప్రకటిస్తావు నేనెన్నో దుఃఖజ్వాలల్లో
కాలిపోతూ మౌనంతో కరచాలనం చేస్తాను.
తప్పని పరిష్తితుల్లో తప్పించుకోలేక
తన్నుకొస్తున్న దుక్కాన్ని ఆపుకోలేక
ఆగని కన్నీళ్ళకు దారి చూపలేక
తపన పడుతున్న మనసుని
మనసు పడుతున్న వేదన తెల్సుకోలేవులే ఏప్పటికీ