ప్రతిరోజు నీ ఊహలతో కలలను కంటుంటే...
ప్రతిక్షణం నీ తలపులే కలవరపెడుతుంటే...
నేననే మాటనే మరిచిపోయానని...
నీవనే ధ్యాసలో గడుపుతున్నానని...
నాకు గుర్తుచేసింది నీ జ్ఞాపకం...
నీవులేని జతలో... జ్ఞాపకాల నదిలో...
ఒక్కడినే ఈదుతున్నా...నీవులేక ఒంటరిగా
రెక్క తొడిగిన ఊహలలో రెప్పచాటు చేరావు...
చిట్టచివరి నిమిషంలో చిక్కుముడిని వేసావు...
మనసూరుకోదే ... మరుపైన రాదే...
నా నీడ నీదే... నిను వీడిపోదే...
అని వెంటాడుతోంది నీ జ్ఞాపకం...
నువ్వు వస్తావని చెప్పావు... చూసాను
కాని ఆకాశాన రాలేదు జాబిలి...
నిదురే పోలేదు నా వాకిలి...
మళ్ళి ఉదయించా వస్తావనే ఆశతో...
చూస్తూ ఉండిపోయాను మౌనంగా...
చలనం లేని శూన్యంగా...
నన్ను శిలగా చేసింది నీ జ్ఞాపకం...
ప్రతిక్షణం నీ తలపులే కలవరపెడుతుంటే...
నేననే మాటనే మరిచిపోయానని...
నీవనే ధ్యాసలో గడుపుతున్నానని...
నాకు గుర్తుచేసింది నీ జ్ఞాపకం...
నీవులేని జతలో... జ్ఞాపకాల నదిలో...
ఒక్కడినే ఈదుతున్నా...నీవులేక ఒంటరిగా
రెక్క తొడిగిన ఊహలలో రెప్పచాటు చేరావు...
చిట్టచివరి నిమిషంలో చిక్కుముడిని వేసావు...
మనసూరుకోదే ... మరుపైన రాదే...
నా నీడ నీదే... నిను వీడిపోదే...
అని వెంటాడుతోంది నీ జ్ఞాపకం...
నువ్వు వస్తావని చెప్పావు... చూసాను
కాని ఆకాశాన రాలేదు జాబిలి...
నిదురే పోలేదు నా వాకిలి...
మళ్ళి ఉదయించా వస్తావనే ఆశతో...
చూస్తూ ఉండిపోయాను మౌనంగా...
చలనం లేని శూన్యంగా...
నన్ను శిలగా చేసింది నీ జ్ఞాపకం...