మనను గోడు భాదగా రాసుకున్నాను
నీ మౌనానికెలా తల్లడిలానో తల్చుకున్నాను
మూసేసిన మనసు తలుపుల ముందు,
దిగులుతో నిల్చున్న క్షణం గుర్తు చేసుకున్నాను
పగలంతా నువ్వు లేని క్షణాలని గడపి
మర్చిపోనివ్వని జ్ఞాపకాల్ని భరించి
కన్నీళ్ళను గుండెల్లో దాచి
పైకి నవ్వులు పులుముకు తిరిగాను..
రాత్రి అయ్యే సరికి
కలల దుప్పటి కప్పుకుని,
నీతీ మాట్లాడుతున్నా ని భ్రమించాను
మళ్ళీ మళ్ళీ నిన్నే ప్రేమించాను
నీవేంత వేదించినా...ఎటకారంగా మాట్లాడినా
మనసుకో ఓదార్పు మాట చెప్పి
వీడ్కోలు తప్పదని నచ్చజెప్పి
నీ తలపులనన్ని తిప్పికొట్టి
ఏకాంతంలో పొగిలి పొగిలి ఏడ్చాను..
నా స్వప్న సౌధపు పునాదులను
ఎవరో పెకిలిస్తున్న భావనలు నాలో
నీ మౌనపు వెక్కిరింపులతో లోలోన కుమిలి పోతున్నా
నీ మౌనానికెలా తల్లడిలానో తల్చుకున్నాను
మూసేసిన మనసు తలుపుల ముందు,
దిగులుతో నిల్చున్న క్షణం గుర్తు చేసుకున్నాను
పగలంతా నువ్వు లేని క్షణాలని గడపి
మర్చిపోనివ్వని జ్ఞాపకాల్ని భరించి
కన్నీళ్ళను గుండెల్లో దాచి
పైకి నవ్వులు పులుముకు తిరిగాను..
రాత్రి అయ్యే సరికి
కలల దుప్పటి కప్పుకుని,
నీతీ మాట్లాడుతున్నా ని భ్రమించాను
మళ్ళీ మళ్ళీ నిన్నే ప్రేమించాను
నీవేంత వేదించినా...ఎటకారంగా మాట్లాడినా
మనసుకో ఓదార్పు మాట చెప్పి
వీడ్కోలు తప్పదని నచ్చజెప్పి
నీ తలపులనన్ని తిప్పికొట్టి
ఏకాంతంలో పొగిలి పొగిలి ఏడ్చాను..
నా స్వప్న సౌధపు పునాదులను
ఎవరో పెకిలిస్తున్న భావనలు నాలో
నీ మౌనపు వెక్కిరింపులతో లోలోన కుమిలి పోతున్నా